పుట:Raajasthaana-Kathaavali.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

రాజస్థానకధావళి.


ముపై మోపి మరల దయఁదలచి యతనితో నిట్లనియె. "నీవు బ్రతుకఁదలఁతువేని యింక ముందెన్నఁడు రాజపుత్ర స్త్రీకి మానభంగము చేయనని ప్రమాణము సేయుము.” ఆపలుకులు విని యక్బరు చక్ర వతి౯ యట్లే ప్రమాణము చేసి గండము తప్పించుకొని చల్లఁగ నావలకుఁబోయెను. రాజపుత్రికయు మానరక్షణముఁ జేసికొనఁగలిగెనని సంతసించి గృహమునకుఁ బోయెను.

అనంతర మొకనాఁడు చక్రవతి౯ పృథివిరాజును పిలువనంపి యొక యుత్తరమును జేతికిచ్చి చదువు మనియె. ఆయుత్తరము ప్రతాప మహా రాజు తనపై ననుగ్రహము చూపవలసిన దని చక్రవతి౯ని వేడుకొనుచు వ్రాసెను. పృథివిరాజు కాలవశమున ఢిల్లీ చక్రవతి౯కి లోఁ బడవలసివచ్చినను వాని మనసునఁ బ్రతాపునిపై నతి గౌరవ ముండెను. చక్రవతి౯ కోలువులోనున్న మహాకవులు మహాశూరులు సైతము సంపదలను సౌఖ్యములను రోసి యాకులలముల దినుచు వనముల వసియించుచు వీర ధర్మము నడపుచు నామహాశూరునియందే గౌరవము గలిగియుండిరి. చక్రవర్తులిచ్చు నైశ్వర్యము మాన్యములు నున్ననలు నశించునుగాని కీతి౯ నశించదుగదా. రాజపుత్రరక్తముగల పృధివి రాజు దృష్టికి, తురక చక్రవతి౯ కెన్నండు తలవంచి సలాము చేయని ప్రతాపుఁడు దేవుఁడువ లెఁ గనఁబడుటఁ జేసి ప్రతాపుఁడు లోఁబడెనా ప్రపంచమంతము గావలసినదే యని యతఁడు నమ్ముచు వచ్చెను. పృథివీరా జాయుత్తరముఁ జదివి క్రిందఁ బెట్టు చుండ "నీ యభిప్రాయ మేమి? అతఁడు లోఁబడునా" యని చక్రవతి౯ యడిగెను. పృథివిరాజు కోపవిషాదములు మొగమునఁ దేటపడ "అతనిని నే నెఱుంగు దును. అతఁడు దీనిని వ్రాసినట్టు నమ్మను. శత్రువు లెవ్వరో వాని పేరు పెట్టి యిట్లు వ్రాసియుందురు. ఈ రాజ్యమంతయు ధారవోసిన నతఁడు లోఁబడు వాఁడు కాఁడు. అయిన నతఁడు లోఁబడఁదలఁచుకొనునేమో వానికి, వ్రాసి కనుఁగొనియెద.” నని ప్రత్యుత్తర మిచ్చెను.