పుట:Raajasthaana-Kathaavali.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణా ప్రతాపసింగు.

161


యావలకుఁ బంపి సోనిగుఱ్ఱ సంస్థాన ప్రభువును నాయకునిఁ జేసికొని మొగలాయి సేనల నెదిరించి తుట్టతుదవఱకు దుర్గమునుఁ గాపాడి ఖడ్గ హస్థులై యొక్కఁడు లేకుండ వీర మరణము నొందిరి. ఆజనముతో పాటు ప్రతాపుని పరాక్రనుములు పాటలుగ పద్యములుగఁ జేసి పాడుచు వాని సైనికులకు మహోత్సాహమును గలిగించుచు వచ్చిన యాస్థానకవి కూడ మృతినొందెను.

అనంతర మొక దాని వెంట నొకటిగ గోట లన్నీయు మొగలాయీల సేనాధిపతి యగుమానసింగు చేఁజిక్కెను. రాజు దాటి పోయె నని గ్రహించి మొగలాయీ సేనలు ప్రతి పర్వతమార్గమునరికట్టి నలుదెసల జుట్టుముట్టి వానికి విశ్రాంతి నొసఁగక తఱుమజొచ్చిరి. వేయేల ! ప్రతాపుని రాజధాని యగునుదయపురమే పగతురయధీన మయ్యెను. అందుచే పులులు వసించుపొదలు, సింగములుండు గుహలు నుదయపుర మహారాజు గారికి విడిదు లయ్యెను. అడవి మృగములతో గలసి మెలసి చాల కాల ముండుటచేఁ బ్రతాప మహారాజు వనమృగంబులవలెనె దాగి యుండుటయు, పొచుండుటయు, నదను వెదకి తన పగతురమీఁద దుముకుటయు 'మొదలగులక్షణముల నేర్పికొనెను. పలు సారులు తాము ప్రతాపుని జుట్టుముట్టి పట్టుకోనఁగలిగితి మని మొగలాయి సేనలు సంతసించుచు నుండఁగ నే వారి యాసలు భంగమగునట్లు ప్రతాపుఁడు తన సేనతో నింకొక మూల శత్రు సేనలఁ దఱుముచుఁ గానఁబడుచువచ్చె. ఒకప్పుడు రాణా చాలదూరమున నున్నాడని విని తురుష్క సైన్యము నిర్భయముగఁ బోవుచుండ నాకస్మికముగ నేమూలనుండియో ఇదే రాణా వచ్చె వచ్చె నని కేక వినఁబడుటయు వినఁబడినతోడనే ప్రతిపొదనుండి ప్రతి మూలనుండి వీరుల చేతుల నుండి బాణవర్షములు గురియుటయుఁ దఱుచుగ సంభవించుచు వచ్చెను. ఈవిధముగ వారిం దప్పుదారులఁ బెట్టుచు నొకమాఱు ప్రతాపుఁడు మొగల్ సేనలలో నొక పెద్దభాగమునే పట్టుకుని నిశ్శేష