పుట:Raajasthaana-Kathaavali.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

రాజస్థానకధావళీ,


ప్రతాపుని పక్షముననున్న సైనికులందఱు నిరువది రెండు వేల మంది. వారు మహా పౌరుషశాలురేగాని సకలసాధన సంపత్తి గల ఢిల్లీ సైన్యమున కీఁడగువారు గారు. వారిలో ననేకులు రాజపుత్రులు గడువిశ్వాసముఁగల భిల్లులు గలిసియుండిరి. ఆయడవిలో గొందఱు వనచరులుండిరి. వారిని యుద్ధమునకు రప్పింపవలయు ననుకొన్నఁ గ్రమమయిన యుద్ధమున నిలుచుట యెట్లో పోరుటయెట్లో వారెఱుం గరు. ఆకారణమున వారు రణమునకు రాఁక యే రాణాకు సాయముఁ జేయఁదలంచి కొండ లెక్కి చెట్ల చాటున నుండి వీలగునప్పు డొకటి రెండు బాణముల విడుచుచు శత్రువులు కొండలనడుమునుండి పోవునప్పుడు వారిపయిన 'పెద్ద పెద్ద ఱాళ్ళను దొలి౯ంచుచు యధాశక్తిగ స్వామిభక్తిని జూపు చుండిరి. అంతట నుభయ సేనలకు ఘోర యుద్ధ మారంభమాయెను.

కొండకనుమ నాక్రమించిన చోఁ దమకు సేమమగునని తురకలు ప్రయత్నించిరి. రాజపుత్రులు వీరావేశముతోఁ గొండదారి తుర కలపాలఁ బడకుండఁ గాచుకొనిరి. ఎక్కడ యుద్ధము సంకులమయ్యేనో యక్కడ భానుబింబ చిహ్నముగల ధ్వజముతోడను, వెల్ల గుబ్బ గొడుగుతోడను తప్పక ప్రతాపుఁడు గానఁబడుచువచ్చెను. అతని ముఖ్యాభీష్టము మానసింగునుగలిసి వానినోడింపవలయునని. అందుచే నంతకంతకు ముదుకు చొరుచుకొని వచ్చి ప్రాణములపై నపేక్ష విడిచి యతఁడు బోరఁజోచ్చే. రణరంగమున నతఁడు కొంతదవ్వు పోవునప్పటికి వివిధాలంకారముల చేత నలంకృతమయి బంగారపు టంబారీగల యొక పట్టపు టేనుఁగు వాని కగపడియెను, దాని చుట్టు వందలకొలఁది జనులు జేరుటచే నది చక్రవతి౯ పుత్రుడగు సలీముని యేనుఁగని గ్రహించి ప్రతాపుండు విజృంభించెను. విజృంభించుటయు సలీముని యంగరక్షకులు రాజపుత్రులచే విహతులై నేల నొఱిఁసరి. మావఁటివాఁడు కూర్చున్న చోటుననే క్రుంగిపోయె. అంబారీకి నలు