పుట:Raajasthaana-Kathaavali.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హళ్డీగట్టు యుద్ధము.

149


కిందోలి తాము రాజు వద్దకుఁ జనిరి. పట్టణములు పల్లియలు నిర్జనములై భయంకరము లయ్యెను. మహావీరులు వసియించిన తావుల వన ములనుండి వెలువడివచ్చి ఘాతుక మృగములు సంచరింపఁ జోచ్చె.బాటసారులు నడువకక పోవుటచే మాగ౯ములన్నియు ముండ్లతో నిండి బయనంబునకు నిరోధము గలిగించెరు. ఢిల్లీ చక్రవతి౯ ప్రతాపుని మీఁద దండువిడియ వాని సైనికులకుఁ దినుట కన్నము కాని ద్రావుటకు జలంబులుగాని లభింపవయ్యె. ఆయిక్కట్టులకు దోడుగ మహారాణా ప్రతాపసింగు నడుమ నడుమ కమలమియరు కోటలో నుండియో మఱి యే యడవి లోనుండియో నాకస్మికముగ బయటకువచ్చి సూరతు నగరమునుండి ఢిల్లీ చక్రవతి౯ నిమిత్తము విలువగల సరకులం గొనిపోవు బిడారములను కోల్లఁగొనుచుండును. మణియొకమాఱు తన యాజ్నఁ జెల్లింపక బుద్ధిహీనుఁ డెవండై న కక్కుఱితిచే నేలదున్నుట పశులమందలను బెంచుట మొదలగు కృత్యమలఁ జేయుచున్న వాఁడేమో పరీక్షించి చూతమని రాజస్థాన మధ్య భాగమునకువచ్చి శోధించుచుండును. ఇత్లువిహరించు చుండ నొక నాఁడోక చోట మంద భాగ్యుడోకఁడు రహస్యముగఁ దన మేఁకల మందను పచ్చిక బీళ్ళ మేపుకొనుచుండెను, అది రాణాచూచి వాని బిలిచి నాలుగుమాటలు వాని నడిగి సంగతి తెలిసికొని తక్షణమె వానికి మరణదండన విధించెను. ఆనిర్బాగ్యుని శవము దహనము చేయుటకై న దిక్కులేమిచేఁ గాకుల గ్రద్దల పాలయ్యెను.

ఆక్బరున కీకార్యములన్నియు నసహ్యములు గనుండెను. అతఁడీవిరోధమును మితి మీఱునట్లు చేయుటకిష్టపడఁడయ్యె. సహజముగ పరిశుద్ధ మనస్కుఁ డగుటచే నక్బరు భరతఖండము నంతయుఁ దా నేక ఛత్రముగఁ బాలింప వలయు ననియు, దన చల్లనిపాలనముక్రిందట నన్ని తెగలవారు సుఖముగ బ్రతుక వలయుననియు సంకల్పించెను. అందుచేతనే యతఁడు రాజపుత్రుల నదివఱకే తక్కిన తెగల వారి