పుట:Raajasthaana-Kathaavali.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

రాజస్థానకథావళీ.


రంతకుమునుపే మేను దొరగిరి. పవిత్రమగు గురువుగారి శరీకరక్తము సోదరుల కిరుఫురకు మధ్యగబాఱుటచే నదిదాఁటి యొకరిపై నోకరు దుముకుటకు వారికి మనస్సొప్పదయ్యె. గురుఫుపోయినఁ బోయెగాని కలహముమాత్రము నివారితమయ్యెను. ప్రతాపుఁడు కొంతసేపటికిఁ దెలివి తెచ్చుకొని సోదరునింజూచి నీవు నా యెదుటనుండి దేశాంతరములకుం బొమ్ము ఇచట నిలువవలదని పలికెను. చిత్తమని కపటవిన యముతో నమస్కరించి సూక్తుడు గుఱ్ఱమెక్కి వెంటనే ఢిల్లీకిఁ బోయెను. ఆనాటి పోరువలన రాణాప్రతాపునకు సోదరవియోగమును ఢిల్లీ చక్రవతి౯కి గొప్ప మిత్రలాభమును గలిగెను.

ఇట్లు కొంద ఱాప్తబంధుపులు కొందఱు రాజపుత్రులు విడిచినను ముఖ్యసామంత ప్రభువు లనేకులు ప్రతాపునకుఁ దోడుపడిరి. జగల్లును సింహాసన మెక్కింపదలఁచిన నాఁడెట్లుండెనో యట్లే చందావతుకులజుండు నేటికిని రాణాపక్షము వహించియుండెను. జయమల్లుని కోడుకులును, పుట్ట యోక్క కొడుకులును తండ్రిమాగ౯ము ననుసరించి రాణాకు విధేయులైరి. అక్బరు చక్రవతి౯ వారి కెం తెంత లంచముల నియ్యదలంచుకొన్నను వారు తమ స్వామిభక్తిని దుచ్చధనమునకై విక్రయింపనోల్లరైరి.

శౌర్య మెంతయున్నను సేనాబలము, తక్కువగుటచే రాజపుత్రులు తురకలను బ్రత్యక్షముగ నెదిరింపఁ జాలరైరి. అందుచే వెనుక రాణాహమీరు “అల్లాయుద్దీను” మీఁదఁ బ్రయోగించిన మాయోపాయములే 'రాజపుత్రులు మరలఁ బ్రయోగింపవలసిచ్చెను. అంతట రాణా ప్రతాపసింగు కొండలలో వసియింపఁ బోవు చుండుటచే దేశమునందలి జనులఁదఱు వానిని వెంబడింప వలయుననియు రానివారు కానివారేయనియు దేశమందంతట నతఁడు చాటఁ బంచెను. ప్రజలు రాజాజ్ఞ శిరసావహించి నేలఁ దున్నక. పొలముల పైరుసేయక తమ పశువులనెల్ల శత్రుదుగ్గము లగుహారావళి పర్వతములలోని