పుట:Raajasthaana-Kathaavali.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హళ్డిగట్టు యుద్దము.

147


వచ్చి యతని యను గ్రహుబునకుఁ బాత్రు డైవానిం గొల్చుచుండెను. వచ్చిన కొత్తలో నన్నదమ్ము లిద్దఱు మిక్కిలి సౌహార్దముతో నుండిరి; కాని దినములు గడచిన కొలఁది స్థితి వెనుకటియట్లే యయ్యెను. తమ్ముని కన్న పై ననూయ పొడమెను. రాజ్య మేలుటకు తనయన్నకంటెఁ దానే యెక్కువ సమర్ధుఁడ ననీ సూక్తుడ్రు తలఁచి యప్పుడప్పుడు దుర్వినయములు జూపుచుండ నొకనాడు వేఁటాడుతఱి నన్నదమ్ములకు మాట పట్టింపులు వచ్చెను. ఆమనస్ఫర్ణ యతంతకుఁ బ్రబలవైరముగ బరిణమింప సూక్తుఁ డన్నతో నిట్లయె. "మనమి రువురము గుఱ్ఱముల నెక్కి బల్లేముల చేతఁబట్టుకొని ద్వంద్వ యుద్ధము చేసి యెవఁడెక్కువ బలవంతుడో, నిర్ణయించుకొందము. పూర్వము తన తాత వ్యాఘుగిరియొద్ద జయము గోన్నట్లె తానును జయము గాంచవచ్చునను ధైర్యమునఁ బ్రతాపుఁ డాయుద్ధమునకు సమ్మతించెను. దేశాచార ప్రకారము గౌరవముల నడపఁదలఁచి వారుభయులు ముఁదు నీవు కోట్టుము ముందు నీవు కొట్టుమని యొకరినొకరు హెచ్చరించుకొని ముందారంభించుట 'కెవనికిం జేతులు రాకపోవుటచే నొక్కసారిగా నిరువురు నొకిరిపై నొకరు దుముకుటకు సిద్ధముగనుండ నంతలోఁ బురోహితుఁము వారి యిరువుర నడుము నడ్డముగ నిలిచి యతిదారుణమై కులనిర్మూల కారణ మైనయాపోరుడుగుమని వేఁడెను.

అప్పటికా వీరుల గ్రోధములు మేర మీణినందున గురుపు మాటమీఁదిగౌరవము చేతగాని బంధుత్వము చేత గాని వారు పోరు మాననొల్లక పొడుచుకొనుటకు బల్లెముల దూసిరి. ఏయుపాయము నైననీకుటుంబకలహమును నివారింపదలంచి పురోహితుఁడు కత౯వ్య మేమియుం, దోపమి యెట్టకేలకుఁ దన చేతిబల్లెముతో దాను బొడుచుకొని యిరువురకు నడుమ నేలబడియె. ఆయమానుషకృత్యముజూచి రాజపుత్రు లిరువుకు సంభ్రాంతులై గురుప్రాణరక్షణము చేయుటకు గుఱ్ఱములమీద నుండి క్రిందికి గుభాలున దుమికిరి, కాని గురువుగా