పుట:Raajasthaana-Kathaavali.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హళ్డిగట్టు యుద్ధము.

143


మృతినొందెను. ఆదేశాచారప్రకారము పీనుఁగును పురోహితుని యింట బాఱ వైచి దహనాదికర్మములు జరుపు మని చెప్పి రాజబంధువులు కుమారుని పట్టాభిషేకము నిమిత్తము మందిరము నలంక రింపఁ జోచ్చిరి.

ఉదయసింగు జగ్మల్లును రాజ్యార్హుఁడుగ జేసినప్పుడు సోనిగుఱ్ఱ సంస్థాన ప్రభు వోక్కఁ డుండెను. ఉదయసింగుని పట్టపు దేవి యాతనికిఁ జెల్లె లగుటం జేసి యా ప్రభువు ప్రతాపునికి 'మేనమామ. అందుచే దన మేనల్లుఁడు సింహాసనబ్రష్తుఁడుగఁ జేయబడుటకు సహింపనోపక యావీరుఁడు దాపుననున్న చందావతువంశస్థుఁ జూచి మీరు దగ్గఱనుండియే యిట్టి యక్రమము జరుగుచుండ నుపేక్షింతురా యని యడిగెను. చందావతుఁ డాపలుకులు విని మఱియొక మాటమీఁద బెట్టి యిట్లనియె. “చావునకు సిద్ధముగనున్న యతఁడు పాలిమ్మని యడుగుచుండఁగ మనము వద్దన నేల ? మృతినొందుచున్న వానిమాట కడ్డము చెప్ప నేల? వానికోరిక యాలాగే చేయుదమని తరువాత మన యిష్టము వచ్చినట్లు చేసికొనగూడదా' యని యామాటల యభిప్రాయము అట్లు పలికి తన పలుకుల యర్థము విస్పష్టమగునట్లు ప్రభువుకు వెండియు నిట్లనియె. "అయ్యా? నేను నీ మేనల్లుని పక్షమువాఁడ నే తప్పక నేను ప్రతాపునకే సహాయము చేయుదును."

ఇట్లు వాగ్దానములు జరిగినను జగ్మలునకు పట్టాభి షేకము చేయుటకే ప్రయత్నములు జరుగుచుండెను. సామంత రాజులందఱు నుదయసింగు కోరిక చొప్పున జగ్మల్లును రాణాగాఁ జేయుటకు వచ్చి కూర్చుండిరి. ప్రతాపుఁడు సోదరుని రాజ్యమునం దుండుట తనకు సేమము కాదని తలంచి యే దేశాంతరములకైనఁ బోవనిశ్చయించి గుఱ్ఱములకు జీను వేసి పయనముగమ్మని సేవకుల కాజ్ఞాపించెను. జగ్మ ల్లు పట్టాభిషేక మహోత్సవమునకై లేచి గద్దె యెక్కఁబోయెను.పట్టాభి షేకమప్పుడు చందాపతుకులవృద్ధు రాణాకు నడుమునకుం గత్తి