పుట:Raajasthaana-Kathaavali.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హళ్డిగట్టు యుద్ధము,

141


నిరువదియైదుగురు కుమారులు గలరు. బహుపుత్రులకు జనకుఁడై యుండుటఁ దప్ప యుదయసింగునివద్ద లోకులు సంతసింపదగిన యోగ్యత మఱి యేదియు లేదు. అతని ప్రియపుత్రుఁడు జగ్మల్ అను నతఁడు. తన యనంతరమున వానినే రాజుఁ జేయుట కతఁడు నిశ్చ యించుకొని సింహాసనమునకు న్యాయముగ రాదగిన వాడును ప్రథమ భార్యకుమారుఁ డగు ప్రతాపుని రాజ్యహీనుం జేసెను. కొడుకుల యెడల నుదయసింగు మిక్కిలి కఠినుండని చెప్పవచ్చును. వేఱోక మారు సూక్తుఁడను మఱియొక కుమారుని జంపింపఁ దలంప బంధువు లండఱు బతిమాలి యాపి యాకుఱ్ఱవాని దేశమునుండి యవ్వల కంపిరి.

సూక్తుఁడు పుట్టగానే వానిజాతకమును వ్రాయు మని తండ్రి జ్యోతిష్కులం బిలుపింప వారు మీన మేషములు లెక్క పెట్టి గ్రహచారములఁ జూచి నోరు చప్పళించి “ఈబాలుఁడు స్వదేశమునకు శత్రుం డగుటయేగాక స్వకులమునుఁగూడ నిర్మూలముఁ జేయు" నని చెప్పిరి. అప్పలుకులు విని తండ్రి భయపడి యది మోదలు వానిని గడుజాగరూకతతోఁ జూచుచుండెను. సూక్తుఁ డై దేండ్ల ప్రాయము గల బాలుఁడై నప్పు డొకనాఁడు తండ్రి వద్ద నాఁడుకొనుచుండగా లోహ కారుఁ డొకఁడు పదునైనఁగత్తిని దెచ్చి రాణా కిచ్చెను. అది వాడి గలదో లేదో చూచుట కుదయసింగు దానితో దూదిబుంగ నఱికి యది పదునైనదే యని సంతసించి యక్కడ పెట్టెను. వెంటనే సూక్తుఁ డాఖడ్గమునుఁ బట్టుకొని "కత్తులు మనుష్యులను నఱకుటకు గాని దూది నఱకుటకుఁగా” వని పలుకుచు నొక్క యేటున నెముక గనఁబడనట్లు తన చేయి నఱకుకొనెను. ఆ చేతినుండి క్రొన్నెత్తురు జోటజొటగారి నేలఁబఱచిన రత్నకంబళమును దడిపి చూపఱకన్నులకు వెరపు గొలుపుచున్నను 'బాలుఁడుమాత్రము బెదరక నొప్పి యని యేడ్వక యెప్పటియట్ల నిశ్చలుఁడై నిలిచెను. కడుపిఱికియగు నుదయ