పుట:Raajasthaana-Kathaavali.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

రాజస్థానకథావళీ,


ముగ నుండెను. అయిన నేమి ! చేఁ జేతుల కోటను పగతుని కప్పగించి సుఖంచుటకంటే నిష్కళంక చరితులై దేశమునిమిత్తము గౌరవముగ బ్రాణముల విడుటచుట యే యుత్తమమని యతఁడు నిశ్చయించుకొనెను. అట్లు కృతనిశ్చయుఁ డై హరవంశజుఁడగు రాజపుత్రుఁ డెవ్వఁడు ప్రాణములు కంఠమునం దుండఁగా రంతంభారు కోటవిడిచి పోవఁగూడదని యొట్టు పెట్టి యది యొక స్తంభముమీఁద వ్రాయించి యనంతరము రక్తాంబర ధారుఁడై 'దేశాచార ప్రకారము తాంబూలము వేసి తన పరిజనులతోఁ గూడి చక్రవతి౯ నేనల నెదిర్చి ప్రాణములువిడిచెను. అది మొదలు నేఁటివఱకు హగవంశజుఁడగు రసపుత్రుఁ డాకోటదరిం బోవునపుడు సిగ్గునం దలవంచుకొని పోవుచుండును.

అనంతగ మక్బరు చిత్తూరుం దోఁచుకొని యాద్రోఁపుడుధన ఢిల్లీ ప్రవేశించెను. అతఁడు మహమ్మదీయుఁ - డైనను హిందువులలోఁ బరాక్రమవంతుఁడగుశత్రువుఁ డుండినపక్షమున వాని నతఁడు తగునట్లు గౌరవించుచు వచ్చెను. ఈచిత్తూరు దండయాత్ర ముగిసినది మొదలు, అక్బరు చక్రవతి౯ రాజపుత్రులకు గొప్ప యుద్యోగము లీయ నారంభించెను. అతని ప్రధానమంత్రులలోఁ గొందఱు సేనాధిపతులలో గొందఱు రాజపుత్రు లుండిరి. చక్రవతి౯ మీవారు విడిచిపోయినపిదప నుదయసింగు తానదివఱకు దాఁగియున్న యడవులలోనుండియుఁ గొండ లలోనుండియు వెలువడి వచ్చి తనగౌరవ హీనమయినజీవితమును నిచ్చటచ్చట కొంత కాలము గడపి వసియించుటకుఁ బట్టణమైన లేక పోవుటచే యొక నగరమును నిర్మింపఁ దలంచి ముందుగా నొక సరస్సు గల్పించి యాసరోవర తీరమున నుదయపుర మను పేర రాజధానింగట్టి యందుఁ బ్రవేశించె. ఆసరోవర మిప్పటికి నుదయసాగర మను పేరల బరగు చున్నది. అది 'యేమిదోసమో కాని మీవారు రాజధానిలో శూర శిఖామణులనేకులుండగ వారిలో నెవరి పేరంబరగక పౌరుషహీనుఁడగునోక యపాత్రుని పేర నేఁటికిఁ బఱగుచున్నది. ఉదయ సింగు మహారాజునకు