పుట:Raajasthaana-Kathaavali.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బప్పరావుల కథ.

3

నెటుబోవఁ దోఁచక దాపుననున్న యొక కొండగుహకు మెల్ల మెల్లనఁ జనియె.అందుండ కొన్ని నాళ్ల కామె కొక నందనుం డుదయించె. అనంతర మాయెలనాగ యొక బ్రాహ్మణుని బిలిచి తనకుమారుని వాని కొప్పగించి బ్రాహ్మణకుమారునట్ల వానిం బెంపవలయుననియు సంప్రాప్త యౌవనుడైన పిదప నొక రాజకన్యను వివాహము చేయవలయు ననియు, నొక్కి చెప్పి చిరభర్తృవియోగముచే నవసియున్న తనశరీరము విడిచెను. బ్రాహ్మణుఁడును శిశువు నెత్తుకొని యింటికిఁ జని యాబిడ్డకు గుహలో జన్మించిన 'కారణమున గౌహుఁ డను పేరు పెట్టి వెనుచు మని తనకూతుఁన కొప్పగింప నామెయుఁ దన బిడ్డలతో పాటు వానికి సంరక్షణఁ జేయుచుండెను. పెంపుడు తలిదండ్రులు బిడ్డలపై నెంతయను రాగము జూపుదురో యంతయనురాగము బ్రాహ్మణుఁడును వానికూఁతురును వాని పైని జూపి వెంప రాజ కుమారుఁడును క్రమక్రమంబునం బెరిగి కడుంగడు నల్లరిబాలుఁ డయ్యె. అను దినంబును బక్షులఁ జంపుచు వనమృగంబుల వేఁటాడుచు రాజకుమారులం గలిసి యాడుచు పోరాటంబు సల్పుచు నాతఁడు దుండగీడగుటం జేసి వానిని బ్రాహ్మణకుమారునట్ల బెనుచుట వానికి నలవిగాదయ్యె. ఇట్లుండి పదునొకండేండ్ల ప్రాయమున నొకనాఁడానృపకుమారుఁడు వెంపుడు తల్లిదండ్రుల యిల్లు విడిచి, యడవులఁ గొండల, వసియించు భిల్లులమూఁకలఁ గలిసి వారలతో నిచ్చవచ్చిన తెఱంగున మెలంగుచు వేఁటలాడుచు పాటలఁ బాడుచు విహరింపఁ జొచ్చె. ఒకనాఁడు గౌహుఁడు భిల్ల బాలకులం గలిసి వేఁటలాడుచుండ నక్కు మారు లందఱు తమచుట్టు పక్కలనున్న నాగరికులవలె తాముఁ గూడ నొకరాజు 'నేర్పఱచుకొందమని పరిహాసార్థ మనుకొని గౌహుని తమ ప్రభువుగా నియమించుకొనిరి. వెంటనే యొక పిన్నవాఁడు కత్తితోఁ దన వ్రేలుం జీరికోని బొటభొటకారు కొన్నెత్తురు గౌహుని నెన్నొసట టీగావేసెను. రాచరిక ముపూనువాని కట్లు చేయుట యా దేశములో నా