పుట:Raajasthaana-Kathaavali.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హళ్డిగట్టు యుద్ఢము

——:(0):——

అక్బరు చక్రవతి౯ చిత్తూరును నాశనము చేసి పోవునప్పుడు దేశమునం దంతట దారిద్రమును మనుష్యుల హృదయములయందు నిరుత్సాహమును నెలకొలిపి పోయెను. మీవారు యొక్క గొప్పతనమంతయుఁ గధావశేష మయ్యెసు. పుణ్యభూములు పుష్పవనములు కోటలు కొవెలలు సంపూర్ణముగ నాశనము నొందెరు. దేవతాచరిత్రములను రాజపుత్రవీరుల దిగ్విజయములను దెలుపుటకు దేవాలయ పుగోడలమీదను మేడలమీఁదను వ్రాయఁబడిన చిత్తరుపులు రూపుమాసెను. విన్నాణమును దెల్పు వింతసరకులను తీసికొనిపోపుటకు వీలైనంతవఱకు శక్తివంఛన లేక ముహమ్మదీయు లెత్తుకొని పోయిరి. దిగ్గజములను జెవుడు వఱుపఁజాలు రణ భేరులు మ్రోగెడు కాలము పోయినది. నగర రక్షణము చేయుమని ప్రార్థించి నగర దేవత కఖండ దీపారాధనము జరుగు మేలుదినములు గతించినవి. వేయేల? రాణా వారి మందిర ద్వారము లే యక్బరు కట్టింపఁదలఁచిన కొత్త పట్టణము నందలి మందిరము నిమిత్తము తీసికొని పోఁబడెను. దేశమునంతను దుడిచి వేయుచున్న యుద్ధతరంగ మంత తో నిలిచిపోయెను.

రతంభారుకోట వెనుక బహదూరుషా చేతఁజిక్కెనని చదువరు లెఱుఁగుదురు. తరువాత దాని నా మహమ్మదీయ ప్రభువు వద్ద నుంచి బూందీసంస్థాన ప్రభువగు హర యనునతఁడును జోహణవంశస్థుఁడగు మఱియొకఁడును మఱలఁ బట్టుకొనిరి. ఆకోట యీకాలమున బూందీప్రభువగు సూర్జునుఁ డనునతని యధీనమున నుండెను. అతఁడు మీవారురాణాకు లోఁబడి యరిగాఁ పై యాకోట నేలుచుండెను. ఈ సూర్జనుఁడు వెనుక చిత్తూరి ముట్టడిలో, 'బహుదూరుషాతో యుద్ధము చేసి మృతినొందిన యర్జునరాపు కుమారుఁడు. అక్బరుచక్ర