పుట:Raajasthaana-Kathaavali.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

రాజస్థానకధావళి.


మెక్కెననియు నిదివఱకుఁ జెప్పియుంటిమి, ఇతఁడు గద్దె యెక్కిన తోడనే షర్షా యొక్క సంతతి వారికి మంత్రియగు హేముఁడను హిం దువుఁడు తన స్వామి పక్షమున నభిమానము గలిగి మహాసేనం గూర్చుకొని యక్బరు మీఁదికి యుద్ధమునకు వచ్చెను. అక్బరును వానిగుండె కాయయు సంరక్షకుఁడు నగు బేరాముఖానును గలిసి హేమునిమీఁదిఁకి బోయి వాని నోడించి పట్టుకొనిరి. హేముని స్వహస్తముతోఁ జంపుమని బేరాముఖానుఁ డక్బరుతో జెప్పెను. అసహాయుఁ డై చెరలోనున్న దీనునిఁజంపుట యనుచిత మని యతఁ డట్టిపని కొల్లండయ్యె. బేరాముఖానుఁడు హేముని స్వహస్తముతో నరికిచంపెను. బేరాముఖానుఁ డక్బరును పుత్ర ప్రేమతో నాదరించి యుక్త వయస్కుడైన పిదప రాజ్యము నప్పగించెను. అక్బరు రాజ్యభారమును వహించి హిందువు లొక కన్నుగ మహమ్మదీయులు రెండవకన్నగ నెంచుకొని భరతఖండమును న్యాయముగఁ బాలించెను. ప్రజలంద ఱక్బరుని కేవలము ధర్మరాజని కొనియాడిరి. మహమ్మదీయు లని పక్షపాతము లేక హిందువులని క్రోధము లేక యిద్దఱను సమానముగ నమ్మియిరువురకు గొప్పగొప్ప యుద్యోగములు భేదము లేకుండఁగ నిచ్చెను. సేనాధిపతులు దేశాధిపతులు వానిక్రింద హిందువు లనేకు లుండిరి. రాజపుత్రునకుఁ దనకు మైత్రి హెచ్చునట్లు వారిపిల్లలం దాను 'బెం డ్లియాడి పట్టపు దేవులం జేసెను. ఈతని జ్యేష్ఠపుత్రుండును వాని యనంతరమున రాజ్యమునకు వచ్చినయతఁడునగు జహంగీరు చక్రవతి౯ యొక రాజపుత్ర స్త్రీ వలనఁ గలిగినకుమారుఁడే. రాజపుత్ర వీరులును దమయెడలఁ జక్రవతి౯ చూపు గౌరవమునుబట్టి తాముగూఁడజక్ర వతి౯కి విధేయులై చుట్టములై నెచ్చెలులై యవసరమగునప్పుడు తమ ప్రాణములనైన నడ్డము వేసి వాని ప్రాణమును గాపాడుచు వచ్చిరి. అక్బరు మిక్కిలి పండితపక్షపాతి. ఆచక్రవతి౯ యాస్థానమున అరబ్బీ పారసీ భాషలు నేర్చినపండితులే గాక సంస్కృతమును దేశభాషను