పుట:Raajasthaana-Kathaavali.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

రాజస్థానకథావళి,


అతఁడు వడుటయుఁ గోటలోపల సైనికులు జయమునం దాశ వదలుకొని కడపటి కృత్యమునుఁ జేయఁ బూనిరి. ఆఁడువాండ్రు బారులు కట్టి జోహారు సేయుటకు సిద్ధమైరి. మగవారు రక్తాంబరధారులై తాంబూలములు నమలుచు నూరేగింపు మహోత్సవమునకు జనునట్లు యుద్ధమునకుఁ జనిరి. పర్వత శిఖరమునందున్న యక్బరునకుఁ గోటలో పొగలు మంటలు గనఁబడి కమురుకంపు కొట్ట నారంభించెను. మొగలాయి 'సైనికులు తత్కారణము లెఱింగి రక్షణము బోత్తిగా లేకయున్న యుత్తరపువైపున నుండి లోపలఁ బ్రవేశించిరి. కాని యప్పటికినిఁ జిత్తూరు కోట పగతురచేఁ జిక్క లేదు. ఏలయన నిర్భయముగా నగ్నికుండములఁబడి మృతినొంది వీరపత్నుల యొక్కయు వీరమాతలయొక్కయు గన్యలయొక్కయు భత౯లు పుత్రులు తండ్రులు రక్తవస్త్రములు గట్టి కోటలోఁ బ్రవేశింపఁబోవు మొగలాయి సైనికుల హుమ్మని దలపడిరి. ఆ యుభయవీరులు పోరు సల్పిన తావునఁ బ్రత్యంగుళము రక్తముతోఁ దడిసి యడుగు జారుచుండెను. తురక సైనికులు చిత్తూరునగరమునందలి యిరుకు సందులును వంకరవీధులను జొచ్చి యడుగడుగునకు నొక్కొక్క రాజపుత్ర వీరుని వధియించుచుఁ గ్రమక్రమంబునఁ జొరుచుకొని లోలోపలకుఁ బోయిరి. ఆదుర్దినమున నెనిమిది వేలనుంది రాజపుత్ర వీరులు మృతులై రణరంగము నలంక రించిరి. మృతినొందిన యాఁడువాండ్ర బలగములో దొమ్మండుగురు పట్టపు దేవులు నైదుగురు రాజపుత్రికలు నుండిరి. ఆనాఁటితో చిత్తూరు యొక్క భాగ్యము కడముట్టెను.అది మొద లానగరము మీవారు రాజ్యమున కెన్నడు మరల రాజధానిగ నుండ లేదు.

అట్లు చిత్తూరునగరమును నిర్వీరముగఁ జేసి యక్బరుచక్రవతి౯ 1567వ సంవత్సగము మెయినెలలో నొక దినమున కోటలోఁ బ్రవేశించెను. మీవారు రాణా తరువాత నెన్నఁడు నాభయంకర బ్రదేశమునకు వచ్చి కాపుర ముండలేదు. మరల మీవారు దేశస్థులు