పుట:Raajasthaana-Kathaavali.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

రాజస్థానకథావళీ,


నూరుగురు చొప్పున చచ్చిరి. చావనివారు చచ్చిన వారికళేబరములను దమకు దెబ్బలు తగులకుండ నడ్డు వెట్టుకోనుచు బనిచేసిరేగాని జంకి వెనుకంజ నిడరైరి. కోట సంరక్షించుచున్న రాజపుత్రులు తమ దురవస్థ నప్పుడు దెలిసికొని భయపడఁజొచ్చిరి. రాణా యదివఱకే తమ్ము విడిచిపోయి తనదారి తాను జూచుకొనుటచే వారు నిరుత్సాహులై ధైర్యలక్ష్మియే తమ్ము విడిచినట్లు కళవళ పడఁజొచ్చిరి. కోటదెస చూడ రాజుతోఁగూడ రాజ్యలక్ష్మి యాతావు విడిచి పోయినట్లు పాడు వారు చుండెను.

అందుచే రాజపుతు లేమియుం దోఁచక తడబడుచుండ నింతలో తుపాకిమందు కూరిన యొక నేలసోరంగ మంటుకొని చుట్టు ప్రక్కల ప్రదేశ మంతయు నాశనము చేసెను. ఒక ప్రక్క కోటగోడ గుభాలునఁ గూలెను. దానితో ముట్టడించుతురకలు, ముట్టడింపఁబడు రాజపుత్రులు వందలకొలఁది జచ్చిరి. తరువాత నుభయ సేనలు కలియం బడి సందడికయ్యముఁ జేసెను. అంతలో మరియొక నేలసొరంగ మంటుకొన, తురకలు రాజపుత్రులు మేనులు దెగి తుత్తునియలై మృతి నొందిరి. బ్రహ్మాండము వగులునట్లు మహాధ్వనితో నాసొరంగము లంటుకొనుటచే కోటగోడలు కూలిపోయెను. ఆ ప్రాంతమం దాకాశమంతయు దుమ్ముతోను పొగతోను నిండి యుండుటం జేసి మనుష్యుల కూఁపిరి సలుపదయ్యె. ఆకసమున కెగిరిన మనుష్యావయవశకలములు మట్టిముద్దలు రాతిముక్కలు వర్షము కురిసినట్లు క్రింద రాలఁజొచ్చెను. దుర్గసంరక్షణము చేయవచ్చిన వీరులలో వృద్ధులు కొందఱు ముందుగా వీర స్వర్గము నలంకరించుటచే సైన్యాధిపత్యము బాలుఁ డగు 'పుట్ట' మీదఁబడెను. ఆబాలుని తల్లి చిత్తూరునగరమునందె యాసమయమున నుండుటచేఁ దన కుమారుఁ డదివఱకుఁ గొన్ని దినముల క్రిందట నూతనముగా వివాహమాడిన బాలికపైఁ గలయను రాగాతిశయము చే జావునకు వెఱచి వెనుక దీసి యప్రతిష్ట తెచ్చునేమొ యని బెంగ