పుట:Raajasthaana-Kathaavali.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు మూడవముట్టడి.

129


శిఖరము మీఁద పెద్దమంట వేయించుచువచ్చెను. ఆమంటలు చిత్తూరు కోట కావలివాండ్రకుఁ బ్రతిరాతము స్పష్టముగఁ గనఁబడుచు వచ్చెను. ఉదయసింగు మహారాజు ప్రాణముల కాసపడక చిత్తూరు గౌరవము నిలుపుటకై రేలుఁబవళ్ళు పోరాడుచున్న వీర యోధులకుఁ బోత్సాహముఁ గలుగఁ జేయుటకు మారు దుర్గరక్షణ మన్యులపాలు చేసి, తాను కోటవిడిచి హారావళీ పర్వతములకుం బారిపోయెను. అయినను మీవారు దేశముపై నభిమానముఁగల తక్కిన రాజపుత్రులు తత్సహాయార్ధము రాకపోలేదు. బదనూరు ప్రభు వగు జయమల్లుఁడును చందావతువంశస్థుఁడై 'ఖేల్వా' సంస్థానప్రభు వైన ఫుట్టాయను పదునాఱేండ్ల బాలుఁడును వచ్చి తోడుసూపిరి. వారిలో నప్పుడు పుట్ట తక్కి నరాజపుతులకన్నఁ జిన్నయయ్య. చందా వంశస్థుఁ డగుటచే తాను రాణాకు ముఖ్యుఁడనియు రాణా లేనపుడు కోట సంరక్షించు భారము తన దనియు దాను మొనఁగాఁడై సేనల నడుపుదు ననియు, జెప్పి కయ్యమునకు మొదట సిద్ధమయ్యెము. దేవలనగరాధిపతి తన పితృపితామహుల జన్మస్థాన మగుచిత్తూరు పై మహాభిమానముఁ గలిగి యావిపత్సమయమున దానికిం దోడ్పడుటకుఁ దనకొడుకు నంపెను.

అక్బరు చక్రవర్తి యీకోటఁ బట్టుకొనుట కెన్ని ప్రయత్నములు చేయవలయునో యన్నియుఁ జేసి హిందూ దేశ మంతటనుండి నేర్పుగల పనివాండ్ర ననేకులఁ బిలిపించెను. కోటబురుజుల మీఁదనుండి రాజపుత్రులు నిప్పులవర్షము గురియించు చున్నను వెరువక మొగలాయీ సేన లంతకంతకు దరికిఁ బోవ సాగెను. గెలిచినచో చాల బహుమానము లిత్తునని చక్రవర్తి యాశ పెట్టుట చేఁ బనివాండ్రు సైనికులు నోడలు దాచుకోనక యెవరు చేయవలసిన పని వారు చేయఁబూనిరి, సొరంగములు త్రవ్వువారు సొరంగములు త్రవ్విరి. అందులో మందులు కూరువారు మందులు కూరిరి. మొగలాయి సైనికులు దినమునకు