పుట:Raajasthaana-Kathaavali.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

రాజస్థానకథావళీ.


అది యటుండ నిచ్చట హుమాయూనునకు నమ్మిన చెలికాఁడును మంత్రియు నైన బేరాంఖా ననునతఁ డక్బరుయొక్క చిన్న తనమందు నాలుసంవత్సరములు చక్కఁగా పరిపాలించి పిదపనక్బరున కప్పగించెను. అక్బరు చక్రవర్తియై తాను బాలుఁడై నను దృఢమనస్కుఁడై తనమాటయందు ప్రజలకు మంత్రికి గౌరవము నిలుచునట్లు నడచుకొనజోచ్చెను. అతఁడు రాజ్యముబూనిన కొద్దిదినములకే రాజపుత్రుల మీఁద దండయాత్ర చేసెను, వాని తండ్రి సింహాసనభ్రష్టుడై దేశాంతరముల పాలై పోయినప్పుడు రాజపుత్ర ప్రభువులు చేసిన యనాదరణము ద్రోహముఁ బలుమారు తల్లి యగు హామిడాదేవివలన విని యుండుట చేతనో లేక తల్లి పడిన బాము లన్నియు గర్భములో నున్నపుడు వాని మనస్సుమీఁద ముద్రితము లయ్యెనో లేక శూరులను జయించి కీర్తి జెందగోరుట చేతనో యతఁడు రాజస్థానము మీదికే వెడలెను.

ఆమహాశూరుఁడు తొలుదొల్త మారువారు దేశము మీఁదికి జని మాల్ దేవుని నోడించెను. అంబరు సంస్థాన ప్రభువు చక్రవర్తికి జడిసి కప్పముగట్టి తనకూఁతును వానికిచ్చి వివాహము చేయుటజే నక్బరు వానిం గరుణించెను. తురక రాజునకుఁ దమకూఁతునిచ్చి పెండ్లి చేసి యుత్తమ క్షత్రియవంశమును పవిత్రము చేసిన రాజపుత్రులలో మొట్ట మొదటి వాఁ డితఁడే. తక్కిన రాజపుత్ర ప్రభులందఱు 'తెలివిఁ దెచ్చుకొని జాగ్రత్తపడి చక్రవతి౯కి లోఁబడి కప్పముఁ గట్టిరి. అక్బరును వారిమతము జోలికిఁ బోక లోఁబడిన పిదప వారినఁదఱ సన్మానించెను. హిందువులు తమ పుణ్య క్షేత్రములకు యాత్రనిమిత్తము పోవునపుడు తురక చక్ర వర్తులు వారియొద్ద నొక పన్ను గ్రహించుచువచ్చిరి. అదిగాక తురకలు కానందుకు హిందువు లేడాదికి తలకొక రూపాయ వంతున పన్నియ్యవలసి వచ్చెను. హిందువుల మీద నన్యాయముగఁ గట్టఁబడిన యీ రెండు పన్నుల నక్బరు చక్రవతి౯ తీసివేసెను. ఇట్ల