పుట:Raajasthaana-Kathaavali.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

రాజస్థానకధావళీ,


లును గొందఱు నీరు త్రావిన కొంత సేపటికి గుండెల బరువువలన బాధపడి చనిపోయిరి. ఎట్టకేలకు హుమాయూను కొందఱుపరిజనులతో చచ్చిచెడి యమరకోటఁ జేరెను. అమరకోట మృత్యు దేవతకోటలలో నొకటియని చెప్పఁదగి యున్నను అక్కడికోట యిటుక గోడలు రాతిబురుజులు చుట్టుగుడిసెలు గలిగి దర్శనీయముగ లేకున్నను నిరాధారు లగు నాజనులకు నయనోత్సవము గావించెనుఁ ఆయూరి కుత్త రమున మంచినీళ్ళ కాలువ యొకటి యుండెను. హుమాయూను పరిజనులందఱుఁ దమ కాదినము పండగదినమట్లు భావించి కరువుదీర నీరు ద్రావి సుఖించిరి. ఆయూరి రాజు వారి బాధలు తొలగించుటకు తనకుఁ జేతనైనంత పని చేసి చక్రవతి౯కి విధేయుఁడై యుండెను. హుమాయూనుని కొత్త భార్యయగు హామిడా నిండు చూలాలై యాయెడారులలో మగ వారికంటె నెక్కుడు ధైర్యముఁ గలిగి యద్భుత శక్తితోఁ బయనము చేసి దారుణ కష్టములం గడిచి యమరకోటఁ జేరెను. అక్కడ వారున్న కాలముననే 1542 వ సం౹౹ ము అక్టోబరు నెలలో నక్బరు పుట్టెను. అతఁడు చక్రవతి౯ చూడామణి యనియు రాజన్య చూడామణియనియు భరతఖండమును బాలించినదొరలలో నగ్రగణ్యుఁ డనియు పేరువడసెను. తన భార్యలను బిడ్డలను ప్రాణప్రదాత యగునమరకోట రాజు సంరక్షణములో నుంచి హుమాయూను బయన మారంభించెను. ఇటు కొంతకాలము తిరిగి తిరిగి యతఁడు పారశీక దేశము జేరి యారాజు ననుగ్రహమున తనపిత్రార్జిత మగుకాబూలు గాంధార దేశములను జయించెను. అవి మొద లతఁడు కొంచెము నిలువఁదొక్కుకొని క్రమక్రమముగా బలపడఁబొచ్చెను, వాని సోదరులలోఁ గొందఱు మృతినొందిరి. కొందఱు రాజ్యభ్రష్టులై దేశముపాలైరి.

ఇక్కడ ఢిల్లీలో షర్ఖ్హాను హుమాయూనుం బారఁదోలి గద్దె యెక్కి ధర్మాత్ముఁడై 'దేశమును జక్కగా పాలించి చివఱకు యుద