పుట:Raajasthaana-Kathaavali.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

రాజస్థానకధావళీ


వచ్చిన సంవత్సరమే చిత్తూరుకోటను పూర్ణముగఁ బాడు చేసిన యొక మహాశత్రువు జన్మించెను ఆశత్రువుఁడు ప్రసిద్ధికెక్కిన అక్బరు చక్రవతి౯యే.

ఉదయసింగు కొండకోటలోఁ గోమటియింటఁ బెరుగుచున్నప్పుడు ఢిల్లీలో మార్పుల నేకములు జరిగినవి. హుమాయూను చక్రవతి౯ పరమసాధువగుటచేఁ దనమీఁద పితూరీలు చేసి జనులను తన పైఁ దండెత్తివచ్చి తన్ను జాల చిక్కులు పెట్టుచువచ్చిన తమ్ములను క్షమియించి కనికరించి యెప్పటియట్లు గౌరవమున జూడఁ దొడఁగెను. యుద్ధములో నతఁ డెంత శౌర్యవంతుఁడై యొడలు మఱచి పోరుసేయునో తదితర కాలములయం దతఁ డంత భోగ పరాయణుఁడై నిశ్చింతతో గాలము పుచ్చును. వేయేల? వాని దయాస్వభావమును, వాని సోమరితనమును తుట్టతుదకు వానిని సింహాసనబ్రష్టుని జేసినవి. అతఁడు కష్టపడి చెమట యూడ్చి మాళవ దేశమును జయించెను. కాని లొంగినదానిని పూతి౯గ లోఁబఱచుకొనక సంతోష పరవశుఁ డై బంధుమిత్రులతో విందులనారగించుటతోను మహాభోగములతోను గాలము వెళ్ళబుచ్చెను.

ఇట్లుండ 'షర్ఖాను' అను ' పఠాణిజూతిలోఁ జేరిన యొక తుఱక బంగాళమునందు చక్రవతి౯ యధి కారమునకు తిరుగుబాటు చేసి యొక సేనం గూర్చుకొని దానిం జయించి తాను నవా బగుటకుఁ దలఁచుచుండెను. వెనుక హుమాయూను బంగాళా దేశమును జయించుచుండఁగాఁ జిత్తూరునుండి కర్ణావతీ దేవి వానిని రమ్మని వత౯మాన మంపుటయు నతఁడు బంగాళము సరిగా లోఁబఱచుకొనకయే కర్ణావతి కుమారుని రక్షించుటకుఁ ద్వరపడి చిత్తూరునకు బోవుటయుఁ జదువరులంద ఱెఱుంగుదురు. షర్ఖానుండు రేఁగిన వాఁడని వినినతోడనే హుమాయూను సేనాసమేతుఁ డై వాని నడఁ చుటకు బంగాళమునకుఁ బోయెను. అతఁ డక్కడకుఁ బోయినతోడనే తొల్లి వానిచే