పుట:Raajasthaana-Kathaavali.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

రాజస్థానకధావళీ,


యసింగు సోనిగుఱ్ఱప్రభువు కూఁతును బెండ్లి యాడఁగూడదని పట్టు పట్టిరి. అయిన నుదయసింగుని బంధుమిత్రులు కలిసి యోచించి సోనిగుఱ్ఱ ప్రభువుతో వియ్య మొందుట వలన గలిగెడు ననేక లాభముల నుగ్గడించి హమారుని శాసనము రెండువందల యేండ్ల నాఁటి దనియు దేశ కాల పాత్రములను బట్టి తామది మార్చుకొన వచ్చుననియు నప్పటి స్థితిని జూచిన పక్షమున రాణాహమీరే తన ప్రతిన మార్చుకొను ననియు నొక్కి చెప్పి యాపట్టు పట్టిన వారి నొడంబరచి వివాహము చేసిరి.

ఉదయసింగున కన్నియు శుభసూచకము లే యయ్యెను. ఆదినములలోనే వనవీరుఁడు తనకూఁతునకు వివాహము చేసి యామెకు నైదువందల గుఱ్ఱములను బది వేల యెద్దులపై వేసి యమూల్య వస్తువులను సారె పంపెను. ఉదయసింగుని మిత్రులు కొందఱాసారె నడ్డముగొట్టి యాసరకులను దోఁచుకొని ఉదయసింగు వివాహము నిమిత్త ముపయోగించిరి. ఇరువురుతప్ప పేరుప్రతిష్ఠలుగల రాజపుత్రులందఱు వివాహమునకు వచ్చిరి. వివాహ మహోత్సవములు మహావైభవముతో జరిగినపిదపఁ బెండ్లికి రాని యాయిరువురు దొరలకు బుద్ధి చెప్పుటకై తక్కినరాజపుత్రులు వారిపై దండు వెడలిరి. ఆయిరువురిలో నొకఁడు రణరంగముస వధియింపఁబడెను. రెండవవాఁడు తెలివిగలిగి యుదయసింగునకు లోఁబడియె. వరవీరుఁడు ఇరువురు రాజపుత్రులకు సహాయము చేయఁదలఁచి తన సేనలం గూర్చు కొనిపోయెను. కాని మంచిసమయమున వాని సైనికులే వాని విడిచి పగవారితో గలిసినందున నతఁడు నిర్విణ్ణుఁడై పారిపోయి చిత్తూరు కోటలో దాఁగెను.

రాజపుత్రు లెన్ని ఫిరంగులు తెచ్చి యెన్ని యేండ్లు కోటముట్టడించినను వనవీరుఁడు నిశ్చయముగాఁ గోటలో సురక్షితుఁడై యుండ వచ్చును. కాని వనవీరుని మంత్రి పైకి తనస్వామి కిష్టముగనున్నను