పుట:Raajasthaana-Kathaavali.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదయసింగుని కథ.

115


తనకుమారుఁడుగాని రాజపుత్రుండు కాడనియుఁ గడుపుదీపియైనను మానుకొని తాను రాజపుత్రుని రక్షించితిననియు నతఁడు సంగుని కుమారుఁడగు నుదయసింగనియు గోమటి మేనల్లుఁడు కాడనియుఁ బ్రమాణము చేసి వానికి నమ్మకము పుట్టునట్లు పలికెను. అక్కడకు వచ్చిన రాజపుత్ర ప్రభువులలో నప్పుడు చోహణవంశస్థుఁడగు వీరుడుండెను. అతఁడు చిత్తూరురాణాలకు దగ్గర చుట్టము కులవృద్ధు. అపాసా యాసభ వారి యెదుటకువచ్చి యాబాలుఁడు తన మేనల్లుఁడు కాఁడని చెప్పి వానిని చోహణవంశస్థుడగు రాజపుత్రులకుఁ జేతిలోఁ జేయివేసి యప్పగించి తనభారము తొలఁగినదని సంతసించెను.

అప్పుడా వ్రుద్ధ రాజు బాలుని గౌఁగిలించుకొని యతఁడు తన యేలినవాఁడని వానితోఁగలిసి వానియెంగిలియన్నము భుజించెను. అప్పు డుదయసింగు మొగమున లత్తుకటీకా యనఁగా రాజచిహ్న ముంచఁబడెను. వెంటనే యచట జేరిన రాజపుత ప్రభువులందఱు నతఁడు తమ రాజని వాని పాదములకు సాగిలఁబడి మొక్కిరి.

ఉదయసింగునకు సహాయముచేయ మిత్రులు వందలకొలఁది వచ్చి వానికిఁ గావలసిన సాధన సామగ్రులన్నియు సమర్పించిరి. అట్లు వచ్చిన వారిలో మొట్ట మొదటివాడు ముందుగా నీ బాలుని వృత్తాంతము బయలు పెట్టిన సోనిగుఱ్ఱ సంస్థాన ప్రభువు. అతఁడు రాణాతోఁ గలయు టయే గాక తనకూఁతును వానికిచ్చి వివాహము చేయఁదలఁచెను. శోని గుఱ్ఱప్రభువువంటి బలవంతునితో సంబంధ బాధవ్యము లుండుట మంచిదని యుదయసింగుయొక్క ముఖ్య బంధువులు దానికంగీకరించిరి కాని యీసోనిగుఱ్ఱ ప్రభువు యొక్క వృద్ధ ప్రపితామహుఁడగు మాలదేవుఁడు తన వితంతుపుత్రికను రాణాహమీరునకు మోసమున వివాహము చేసినప్పుడు హమీరు మహాకోపోద్దీపితుఁడై తన సంతతివా రెవ్వరు మాల దేవుని సంతతివారితో వియ్యమందఁ గూడదని శాశించెను. ఆమాట కొందఱు రాజపుత్ర వృద్ధులు జ్ఞప్తికిఁ దెచ్చుకొని యువ