పుట:Raajasthaana-Kathaavali.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదయసింగుని కథ.

107

ఒక నాఁడు సాయంకాల మెప్పటియ ట్లంతఃపుర సేవకుండగు మంగలిఁ డుదయసింగునకు నన్నముదెచ్చి పెట్టి యారగింపఁ జేసెను. రాజపుత్రగ్రహములలో మంగలివాండ్రు తక్కిన పతిలకుఁ దోడుగ వంటలుగూడ చేయుదురు. ఉదయసింగు భోజనము చేసియొక పాన్పుపై నిద్రపోయెను. వానిమంచముప్రక్కనే దాసీపుత్రుఁడును పండుకోని నిద్రించెను. పున్నయుఁ దన కన్న కుమారునికన్న నెక్కుడు ప్రేమం బెనుచుకోనుచున్న రాజకుమారుని గాపాడుకొనుచు నించుక మేలుకొని యుండె. అట్లుండ నాకస్మికముగ నంతఃపురములనుండి గోలయు రోద నము డనవచ్చె. పున్న తొందరపడి యది యేమో తెలిసికొనుటకు లేచి చెవియొగ్గి వినఁ జొచ్చెను. సాధారణముగ నంతఁపురములో దప్పు చేసిన బానిసలను శిక్షించునప్పుడును నందకత్తి యలగు సవతు లోండొరులతో కలహించునప్పుచును నాత౯ నాదములు వినఁబడుటకలదు కాని యానాటి ధ్వను లట్టివిగా నుండవయ్యె. శ్రడణదారుణమై గర్భ నిర్వేదకమైవినఁబడిన యారోదనము మరణసంబంధమైనదిగా గ్రహించి పున్న యేదో యపాయము వాటిల్లెనని తలంచి తాను తనజాగ్రత్త మీఁదనుండెను.

అంతలో వంటలవాఁడగు మంగలి పరుగుపరుగున వగర్పు కొనుచువచ్చి యాకళవళమునకుఁ గారణ మేనుని పున్న యడుగ నిట్లనియె. “నీ వెఱుగనేయెఱుఁగవా? ఈమూల నుండుటచే నీ కేదియు దెలియ లేదు గాబోలు ! మనదొరలందఱు విక్రమజిత్తును సింహాసనభష్ణుని జేసి వనవీరుని చిత్తూరునకు సంరక్షకుఁ డుగా నేర్పఱచిరి. ఆవన వీరుఁడు రాజ్యము స్వాధీనము చేసికొని విక్రమజిత్తును వధించినాఁడు. ఆ రాజు నిమిత్తము వాని భార్యలు చుట్టములు నేచ్చుచున్నారు.ఈరోదనమది."

ఆ పలుకులువిని పున్న నిశ్చేష్టయై యేమియుఁదోచక పండుఁ కొనియున్న రాజపుత్రుని జూచి తనలో "విక్రమజిత్తును జంపినవా