పుట:Raajasthaana-Kathaavali.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు రెండవముట్టడి.

103


మీఁదను గడువిశ్వాస ముదయింప నతఁడు వారెంత చెప్పిన నంత సేయుచుండెను, ఆపోర్చుగీసువారీ సహాయమున హుమాయూను రాక నడ్డగింపగల శిబిర మొక దానిని నిర్మించి దడులు గట్టించి కందకములఁ ద్రవ్వి యాశిబిరము దుర్భేద్యముగఁ జేసిరి. దాని బలముఁ జూచుకొని బహదూరుషా యింక తాను సురక్షితుఁడ ననుకొని నిర్భయముగ నందు గూర్చుండెను.

ఆవ్యూహము పన్నిన నేర్పరులు మిక్కిలి బుద్ధిమంతులే యగుదురు.కాని శత్రువులు లోపలికి వచ్చుట యెంత కష్టమో లోపలి వారు బై టికిఁ బోవుటయు నంతియే కష్టమనుమాట వారు మరచిరి. వ్యూహము పన్నినయతఁడు పరాజయము గలిగినప్పుడు సేన బారి పోవుటకుఁ దగినవీ లుండునట్లు పన్నవలయును. పోర్చుగీసువారు బహదూరుషా సేన కట్టివీలును కలుగఁ జేయరైరి. హుమాయూను సేనలు నాలుగు దెసలం జుట్టుముట్టి యెక్కడచూచిన దామెయై కనఁబడు చుండెను. తన సేనకు తిండి సరకు లంతకంతకు తరిగిపోవుటయు వానిని దెప్పించు కొనుటకు మరల వీలు లేక పోవుటయు సేన యావలకుం బారి పోవుటకు దుస్సాధ్య మగుటయు శత్రు సేనను జయించుట స్వప్న వార్త యగుటయు నెఱిఁగి బహదూరుషా తనయవస్థకుఁ దానే సిగ్గుపడి యైదుగురుబంట్లను సాయము దీసికొని మారు వేసము వేసికొని యర్ధ రాత్రమున నావలఁబడి ప్రాణములు దక్కించుకొని సేనకర్మము సేన దని యూరకోనెను. సేన మేలుకొని ప్రభువును గానక వానకుఁ గఱిగిపోయిన యుప్పులాగున నదృశ్య మయ్యెను. బహదూరుషా కష్టపడి జయించిన చిత్తూరుకోట హుమాయూనుని స్వాధీణ మయ్యెను.

బహదూరుషా తఱుమఁబడి యొక నెలవుననుండి యొక నెలవునకు బరువు లెత్తుచుఁ గొంత కాలమున కెచ్చటఁ గానఁబడఁడయ్యె. హుమా యూను సమయమునకు వచ్చి చిత్తూరునగరమును గాపాడ లేకపోయినను బహదూరుషా యొక్క మంత్రుల తెలివితక్కువ ప్రయత్నమువలన