పుట:Raajasthaana-Kathaavali.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

రాజస్థానకథావళి.


విధిగా పట్టాభిషేకము చేయుటకు వీలులేక వారండఱు వానిని రాణాగా నేర్పఱచిరి. కోటగోడ లొక్కటొక్కటిగా నేలం గూలఁ జొచ్చెను. చిత్తూరు నలు మొగంబులును శత్రువులు చుట్టుముట్టిరి. ఒక్క గడియలో కఱకుతురకలు బెబ్బులులవలే వచ్చి కోటలోఁ బడుటకు సిద్ధముగ నుండిరి. అప్పుడు స్త్రీలు ప్రత్యేకముగా చితుల నేర్పఱచుకొని యందుఁ బడి చచ్చుటకు వీలు లేదు. అందుచే పుట్లకొలఁది యెండుపుల్ల లొక్కటే కాడుగా పరికించి దానిపై బారువుల కొలఁది తుపాకిమందు పోయించి రాణీ కర్ణానతి పదమూఁడు వేల రాజపుత్ర స్త్రీలతోఁ గూడి యాకాడుం బ్రవేశించి చిచ్చు పెట్టుకొని యగ్ని హోత్రున కేకాహుతి సమర్పించెను. మిగిలిన స్త్రీలు కొందఱు విసముదినియుఁ గొందఱు ఖడ్గములతోఁ బొడుచుకొనియు కర్ణావతి మార్గము ననుసరించిరి.

ఇట్లు నిశ్శేషషఃగ నంతఃపుర కాంత లందఱుఁ గులాచారమును నడపి గౌరవంబును నిలుపుకొన్న పిదప హతశేషు లగు రాజపుత్రవీరులు నిర్విచారముగ రక్తాంబరములు ధరించి యాయుధపాణు లై మృత్యు దేవతం దృణీకరించి కోటతలుపులం దీయించి ముట్టడివేయు మ్లేచ్ఛ సైన్యముపయిం బడిరి. ఆదినము ముప్పది రెండు వేల రాజపుత్రులు దేశాభిమానమునిమిత్తము ప్రాణములు విడిచిరి. రాజస్థానమునం దున్నశూరు లంద ఱానాఁడు పంచత్వము నొందిరి.

అనంతరము బహదూరుషా చచ్చినవారితోడను చచ్చుచున్న వారితోడను నిండియున్న చిత్తూరుకోటలో పదునైదుదినముల వఱకు కొలువుఁ దీర్చియుండెను. అట్లుండ హుమాయూను దండెత్తి వచ్చుచున్న వాఁడను వాత౯ విని దానికిం దగిన ప్రయత్నములఁ జేయ నారంభించెను. బహదూరుషాయొక్క సేనలో పోర్చుగీసువారు కొందఱుండి ఫిరంగులను మిక్కిలి నైపుణితోఁ బ్రయోగించి కోటలోఁ బరుచుకొనిరి. అందుచే నతనికి పోర్చుగీసు వారిమీఁదను వారి ఫిరంగుల