పుట:Raajasthaana-Kathaavali.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు రెండవముట్టడి.

101


యని యాసేవకుఁడు ప్రత్యుత్తర మిచ్చెను ఆపలుకులు విని వల్లేయని హుమాయూను బంగాళమునం దింకను దాను చేయవలసిన పని యున్నను దానిని గట్టిపెట్టి విపత్సముద్రమునం దున్న స్త్రీని సముద్ధరించుట ప్రథమకత౯వ్యమని నిశ్చయించి మహా సేనాసమేతుఁడై రాజస్థానమునకుఁ బోవఁ బయన మయ్యేను.

అప్పటికీ బహదూరుషా యింకనుఁ జిత్తూరుకోటలోఁ బ్రవేశింపలేదు. హుమాయూ నించుక త్వరపడినపక్షమున పట్టణము పరులచేతం బడక యుండును. యెందుచేతనో పట్టణసమీపమునకు వచ్చియు బహదూరుషా పయిం బడక కాలహరణము చేసి యుదాసీనుఁ డయ్యెను. మహమ్మదీయ మతద్వేషులగు హిందువులను గెలుచుచున్న సాటితురక మీఁద గత్తికట్టి పోరుట తనవంటితురక కనుచితమనియు మత విరుద్ధ మనియుఁ దలంచి హుమాయూనుఁ డట్లు పేక్షించెనని కొందఱు చెప్పుదురు. రాజపుత్రులకుఁ బ్రత్యక్షముగ సహాయము సేయకున్నను ఢిల్లీ చక్రవతి౯ యిట్టియకార్యములు చేసినందుకు బహుదూరుషాను మిక్కిలి చీవాట్లు పెట్టి యధిక్షేపించెనందురు.

కోటలో నున్న రాజపుత్రులు లోపలి బలము క్రమక్రమముగ క్షీణమగుటయు పయిసహాయము రాకుండుటయుఁ జూచి చిత్తూరునకంత్య కాల మాసన్నమయిన దని గ్రహించి సర్వము సిద్ధము చేసికొనిరి. బాలుఁ డగు నుదయసింగును విశ్వాసముగల యొక సేవకున కప్పగించి పగతుర చేతఁ జిక్కకండ నావలకుఁ దాఁటించి తొల్లి లక్ష్మణసింగునకుఁ గలిగిన దేవతాసాక్షాత్కారమును జ్ఞప్తికిఁ దెచ్చుకొని తమకు రాజుండవలయునని రాజపుత్ర సేనాపతు లెవ్వని రాజుం జేయుద మని యోచింపుచుండ దేవలకోటనుండి వచ్చినసు రేశ మల్లుని కుమారుఁడు భాగ్జే యనునతఁడు ముందఱికి వచ్చి నేను చిత్తూరురాజులకు రక్తస్పర్శగల జ్ఞాతివర్గములోనివాఁడను. నేను నాయకుఁడనై మిమ్ము నడపెద, నన్ను రాజుం జేయుఁడని కోరగా నప్పుడు యథా