పుట:Raajasthaana-Kathaavali.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

రాజస్థానకధావళీ,


ఆపత్సమయమునం దున్న స్త్రీ లీవిధముగఁ గంకణమును బంపుట తను కెంతో గౌరవమని మహమ్మదీయ చక్రవర్తులు హిందూరాజులుం గూడఁ దలంచిరి.

కర్ణావతి యీయాచారము నడపి తనకుమారుని సంరక్షించు కొనవలయునని సంకల్పించి యంతఃపురమున మెత్తని పట్టుదారములతోఁ గడువిన్నాణముగ నొక పట్టుతోరము నల్లి నమ్మిక గల యొక బంటును బిలిచి యిట్లనియె. "శత్రు సేనల బారిఁ బడకుండ తప్పించు కొని యెట్లయిన హుమాయూను చక్రవతి౯ వద్దకుఁ బోయి యీతోరమును వానికిచ్చి యీతోరమునలన మీవారు రాణీయగు కర్ణావతికి నతఁ డిప్పుడు సోదరుఁ డయ్యెం గావున యాపడ గడువంబెట్ట వలయునని చెప్పుము. " ఆతరముఁ దీసికోని యాబంటు నిరంతర ప్రయాణంబుల ఢిల్లీ పురమునకుఁ జేరి యాసమయంబున నక్కడ చక్రవతి౯ లేమింజేసి యాశాభంగ మొంది యాగ్రా నగరమున బేబరు వేయిం చిన గులాబిపూలతోటలో నతఁడు విహారమును జేయుచుండు నని నిశ్చయించి కాళ్ళీడ్చు కొనుచు నచ్చటికిఁబోయి యచ్చటను వానింగానక నిర్విణ్ణహృదయుఁ డై హుమాయూ నాసమయమున పితూరీల నడఁచుచు రాజద్రోహుల శిక్షించుచు బంగాళా దేశమం దున్నవాఁడని విని చిత్తూ రెక్కడ శత్రువుల పాలైపోవునో యను భయము తన కాళ్ళకింతిం తనరాని సత్తువ గలిగింప నెట్టకేల కచ్చటకుం బోయి హుమాయూనుని సందర్శించి యా దేవి యిచ్చిన పారితోషిక మతనికి సమర్పించెను. సమర్పించుటయు హుమాయూను మహానంద భరితుఁడై దానిం గ్రహించి యాతోరము ముంజేతికిఁ గట్టుకొని రాజపుత్ర స్త్రీరక్షణకుఁ దీక్ష వహించి "కర్ణావతి కేమి కావలయును. యేమడిగిన నది యిచ్చెద. చెప్పు” మని యడిగెను. "స్వామీ ! ఆమె కేమియు నక్కఱ లేదు. ఆమె మీతోబుట్టు వగుటచే చిన్నవాఁడగు మీ మేనల్లుని రక్షింపుఁడు. ఇదియే యామె కోరిక !"