పుట:Raajasthaana-Kathaavali.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు రెండవ ముట్టడి.

99


ధరించి కొంత సేన నడపించుకొని పోయి యొడలు దాఁచుకొనక కయ్యము చేసి స్వర్గస్థురా లయ్యెను.

ఈజవాహీరుభాయి గాక రాణా సంగునకు మఱియొక భార్యయుండెను. ఆమె పేరు కర్ణాపతి విక్రమజిత్తును రాజుగా నంగీకరింపక యీమెకొడు కగు నుడయసింగునే రాణాగాఁ జేయఁ దలంచి రాజపుత్రవీరులు నాభాగములనుండి వచ్చి చిత్తూరులోఁ బ్రాణములు విడుచుచుండిరి. వీరస్వర్గమును జూర గొన్న యగ్జునరా వీదేవి సోదరుఁడే. మరణమునకు జంకని శూరుని గర్భమునఁబుట్టి శూరాగ్రేసరుఁడగు రాణాసంగుని చెట్టఁబట్టిన యీ దేవియు భయమెట్టిదో యెఱుఁగని సాహసికురాలేయై తన ప్రాణములు విడువఁదలంచెను; కాని చిన్న కుమారుని ప్రాణములు సంరక్షించుట కత౯వ్య మని యూర కొనెను వీరందఱు గోటసంరక్షణమునకై యుపాయములు వెదకు చుండ కుమారరక్షణమునకై యామె యుపొయములు వెదకి తుదకొకటి కనిపెట్టెను.

రాజపుత్రులలో నొక చిత్రమైన యాచారముఁ గలదు, రాజపుత్ర స్త్రీ తన 'కేదేని యాపద వచ్చినప్పుడా యాపద దీర్పగల సమర్దుఁ డని తనకుఁదోఁచిన పురుషుని శరణు వేడి వానికి రత్నఖచితమైన కంకణమును గాని పట్టుతోరమునుగాని పంపుచుండును. ఆపురుషుఁడు రాజపుత్రుఁడు గావచ్చును లేక తురకగావచ్చును. ఆస్త్రీ వాని నెఱింగియుండ నక్కఱ లేదు. వానిపేరు విని శరణు వేఁడవచ్చును. ఆపురుషుఁ డా స్త్రీనిఁ జూడవలసిన యావశ్యకమును లేదు. ఆ స్త్రీ పంపిన బహుమానము నా పురుషుఁడు ముంజేతికిం గట్టుకొని యామెను రక్షించుటకుఁ గంకణము కట్టుకొన్న శూరుఁడై యానాడు మొద లామెకు పెంపుఁడు సోదరుఁడై యామెయేదిగోరిన నది చేయునట్లు ప్రమాణము చేయును. ఒక వేళ నా స్త్రీ యీపురుషునకుఁ బ్రాణహాని కలుగు పనులు చేయుమన్న నతఁడు చేసి తీరవలయును.