పుట:Raajasthaana-Kathaavali.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణా సంగుఁడు,

91


మన దేశమున నిలువక స్వస్థానమునకుఁ బోయె. వానితరువాత వాని వంశస్థుఁడును వానికంటెను గ్రూరుఁడు నగు తామరలేను 1399 వ సంవత్సరమున హిందూ దేశముపై దండెత్తి వచ్చెను. ఈతనికాలొకటి కుంటిగ నుండెను. సహజముగ దుర్బలుఁడయ్యు నితఁడు మెచ్చఁదగిన మనోబలముచే మొగలాయిల కెల్ల ప్రభువై తార్తారు దేశమున నున్న సమర్కందునగరమున సింహాసన మెక్కి యనేక దేశ ముల జయించెను. బేబరు తామరలేనున కాఱవతరము వాడు. ఇతఁడు తనవంశస్థులవలె ప్రతాపవంతుఁడె కాని వారివలె నిష్కారణముగా మానవజాతిని నిర్మూలించునట్టి క్రూరుఁడు కాఁడు. ఇతని తలిదండ్రులు చిన్న తనమునందె మృతినొందుటం జేసి బాల్యమునందే సింహాసనస్థుఁడై పలుమారు రాజ్యభ్రష్టుఁడై యనేక స్థలములయందు క్రొత్త రాజ్యములు స్థాపించి యెట్టకేలకు హిందూస్థానముపై దండువిడిసి ఢిల్లీ చక్రవతి౯ యయ్యెను. ఇతఁడు ప్రతాపవంతుఁ డగుటయేగాక పారశీక భాషలో మంచి కవనము గూడ జెప్పఁగల సమర్థుఁడు. ఇతఁడు హిందూదేశమును జయించినాఁ డన్న మాటయే గాని జయించిన పిదప పట్టుమని పదికాలముల పాటు దేశము నేల లేదు. అతఁడు 1526 సంవత్సరమున చక్రవతి౯ యై 1530 సంవత్సరమున మృతినొందెను. ఆనాలుగు సంవత్సరము లైనను మన స్థిమితము లేక యుద్ధములోనే గడపవలసివచ్చెను. ఇతని మరణమును గూర్చి యొక చిత్రకధగలదు. అతని పెద్దకుమారునకు జబ్బు చేసి ప్రాణముమీఁడికి వచ్చినఁట. కుమారునియందు బేబరుకు మితిమీరిన ప్రేమయుండుటచే దనకొడుకును రోగ విముక్తుని జేసి తన కాజబ్బు తెప్పింపుమని భగవంతుని ప్రాధి౯ంచెనట. అతఁడు ప్రాధి౯చినట్లుగానే శ్రమక్రమముగా హుమాయూ నున కారోగ్యము గలుగుటయు బేబరు జబ్బుపడి మృతినొందుటయు సంభవించెను. ఢిల్లీ పాలించిన మొగలాయిచక్ర వతు౯ల కతడె మూలపురుషుఁడు