పుట:Raajasthaana-Kathaavali.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

రాజస్థానకధావళి.


ధ్వనులతోఁ గోటలోఁ బ్రవేశింతు నని చెప్పుచువచ్చె. ఈ పరాజయమువలన గలిగిన పరాభవమును పోగొట్టుకొనువఱకు యుద్ధభూమిలో నొక గుడారము వేసికొని యదియే యిల్లుగా నతఁ డుండెనఁట, అదివఱకు యుద్ధములో మృతినొందిన రాజపుత్రశూరుల యొక్క భార్యలు సేనలం బోగు చేసి ఢిల్లీ చక్రవతి౯ మీదికిఁ జను మని రాణాకు సమర్పించిరిగాని పరాజయమునొందిన యొక్క సంవత్సరములో నే యతఁడు పరలోకగతుఁ డగుటచే నా సేనలం గూర్చుకొని తురకలతో పోరునంతటి భాగ్య మతనికి బట్టదయ్యె.

సంగుఁడు విషము దిని చచ్చెనని కొందఱదురు; కాని యది నిజము కాదు. చిన్న తనమునుండియు నిల్లువిడిచి తిరిగి యతఁడు పడిన కష్టములను మహాయుద్ధములయందు దగిలిన యెనుబదిగాయములను విశేషించి 'కణ్వాహా' దగ్గర జరిగిన యుద్ధమును విషముకంటె నెక్కుడు తీక్షణములై వాని కకాల మరణమును గలిగించెను. మీవారు రాజ్యమును పాలించిన రాణాలలో సంగుఁడు మహాప్రతాపశాలి. అందుచేత నతఁడు యందఱికన్న గొప్పవాడని యప్పుడప్పుడు కోదఱను చుందురు.అతని వెనుక సింహాసనమునకు వచ్చిన వానివంశస్థులు సంగునివలే దృఢచిత్తులై చరించినచో చిత్తూరునకు దీనదశ రాక యుండును.

సంగుని చరిత్రము సమగ్రముగాఁ జెప్పఁబడినది గావున నింక నతని వైరియగు బేబరు చరిత్రము నించుక చెప్పవలసి యున్నది. ఇతఁడు 'మొగలాయివంశస్థుఁడు ఈతని పూర్వుఁడగు చంగిసుఖానుఁడు ఆశియా, యూరోపుఖండముల రెండును దండెత్తి మిడుతలదండువంటి తురక సేనలతో నింపి రక్త ప్రవాహములు ప్రవహిుపఁ జేసి యానాటి మానవజాతి నంతను గడగడ వడఁకించిన చండశాసనుఁడు, అతఁడు పదమూడవశతాబ్దముయొక్క ప్రారంభమున హిందూదేశముపై దండెత్తి సింధునదికిఁ బడమట నున్న భూముల నాశ్రమించి యెందుచేతనో