పుట:Raajasthaana-Kathaavali.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

రాజస్థానకథావళి.


ఆపలుకులు విన్న వారికందఱకు పౌరుష ముక్కెక్కించెను. సైనికులకంఱుఁ దమ వేదమగు ఖురాను జేతఁ బట్టుకొని యుద్ధమున గెలువవలయు లేక చావవలయు నని ప్రమాణములు చేసిరి. ఒడలిలో నూపిరి లేనివాడు సయితము మతావేశము చేత పరవశత్వమునొంది ప్రాణములపై నభిమాసము వదలుకొని ముక్కాకలను దేరిన పగతురం బొడుచుటకు సిద్ధముగ నుండెను. అంతట శత్రువులపయిం బడుటకు వారేర్పాటు జేసికొన్నందున మొనలుతీరిన వెనుక బేబరు గుఱ్ఱము నెక్కి సైనికుల కుత్సాహము గలిగించుచు సేనాపతులకు నడచుకొనవలసిన పద్ధతులను, గఱపుచుఁ గొంతసేపు దిరిగెను.

1527 వ సంవత్సరము మార్చి 27 వ తేది శనివారమునాడు రాజస్థానము యొక్క భాగ్య మేట్లున్నదో నిణ౯యించెడు యుద్ధము జరిగెను. రక్ష రేఖ మఱియొక లాగైపోయినను మొట్టమొదట జయ మెప్పటియట్లు రాణాసంగునికే యగునని యెల్లరు భావించిరి. బేబరు చక్రవర్తి యొక్క సైన్య మదివఱ కెన్నఁడు రాజపుత్రవీరుల పోటు చవిచూచి యెఱుఁగదు. నల్లమందుమత్తుతో కన్ను లేఱ్ఱఁబడ రాజపుత్రయోధులు శత్రువులపయింబడి కత్తులను బల్లెములను రక్తములో ముంచి యెత్తుచు వీరవిహారము చేయనారంభింప, దిట్టతనమునకు ప్రసిద్ధికెక్కిన కఱకుతుఱక లేమియుం జేయలేక యూరకొనవలసి వచ్చెను. పూర్వ మెన్నెన్ని యుద్ధములలో వైరుల యదరిపాటుల నడఁచిన బేబరు యొక్క- జయఫిరంగియైన రాజపుత్రులు నించుక యదుపులో నుంచజాలదయ్యె. ఆసమయము నెఱిఁగి 'బేబరు మంచి యుపాయము నాలోచించి తన సేనలోఁ గొంత భాగమును గుండ్రముగా దిరిగివచ్చి రాజపుత్రుల జుట్టుకొమ్మని యానతిచ్చి ఫిరంగులను ముందునకు జరిపించి మూలబలమునకు తుపాకులిచ్చి ముందునడిపించి బాణవష౯మును గురిపింప నారంభించెను. అప్పుడు రాజపుత్ర సైన్యములో నొక భాగమున కధిపతియైన శిలాదేవుఁ డనునతఁడు రాజద్రోహ