గాలివాన 95 భయంచేత “ఓ” యని మూర్ఛపోయింది. మా తల్లి కామే శ్వరీ తందానా ! మా బాగుందనుకోని ఆ రాక్షసుడు, రకంచరుడు, పిశాచి పొలంలోకి, సొమ్ముమూట ఎత్తుకుపోయే దొంగలా తీసుకుపోయాడు. వాడి బ్రతుకే నీచమైపోనూ తందానా! ఆ మూర్ఛలాంటి కళ్ళల్లో, ఆమెఎదుట చిక్కిపోయిన వాళ్లు, పాలు లేని 'పిల్లలు, పంటలు లేని రైతులు చేతులు చాచి కనబడ్డారు, మా తల్లి కామేశ్వరీ దేవి కోయమ్మా తందానా! ఆ ఓ ఒక్కసారిగా ఆ అమ్మాయికి మెలకువవచ్చింది. ఓ శక్తి అయ్యిందండి." ఏలా విదిలించుకొందో వాడికౌగిలింత, కిందికి ఉరికింది. వాణ్ణి సాగదీసి లెంపకాయ కొట్టి, ఆ పొలా లలో, గోతుల్లో, లేడిలా పరుగెత్తింది. వెనక వాడు, ముందు, ఆమె దడదడ దడదడ తందానా తందానా తాన తాన తాన తందానా! ఆమెని, ఆ రాక్షను డందుకోలేక పోయాడు. రాయి తగిలి తగిలి పడ్డాడు. తందానా ! ఒక ఆమె.. రోడ్డుమీదికి ఉరికిందండీ ఇంతలో కారు లైట్లు. కారు ఆగి ఒక పెద్దమనిషి దిగి “ఎవరమ్మా మీ" రన్నాడు దేవుడై అతడూ తందానా ! “అయ్యా రక్షించండి, ఆ రాక్షసుడు రైలు..... టిక్కట్లు_దివా ను_ఇల్లు ఇక్కడికి అన్నాడు” అంది వగరుస్తూ మా తల్లి కామేశ్వరీ తందానా !
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/97
స్వరూపం