Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గాలిపాన 91 భూములు తనఖా పెట్టి, ఈనాములు కుదువ పెట్టి. విజయనగరం షాహుకార్లను పట్టుకొని, జయ జయ అంటూ దొరికిన జొన్నలు, చోళ్ళు. గంటెలు, సజ్జలు, వరిగెలు పట్టుకువచ్చా డా అభినవ కర్ణుడు, శిబి దధీచి అయిన అప్పలస్వామిగారా ఏమీ చూశారా తందానా తానా | ణ 3 కామేశ్వరి విజయనగరం ఉత్తరాలు రాసి తనతో చదివిన స్నేహితురాళ్ళనందరినీ ఒక సంఘంగా కూడమంది, సభ్యురాండ్రను చేర్చమంది, సభలు చేయమంది, చందాలు వసూలుచేయమందీ తండ్రీ తందాన తందానా ! జనాభా ఎక్కువ, ధనాలాతక్కువ; తినడానికి కడుపుల సంఖ్య ఎక్కువ, తేవడానికి గింజలు తక్కువ; చచ్చినవాళ్ళు చచ్చారు. భగవంతుని ఇష్టం లేక చంపగలవా రెవరు? చావ గలిగినవా రెవరు అని అమ్మలక్కలందరూ వేదాంతాలాడారు, ఓ యమ్మలారా తందానా, తందానా ! తిన ఒంటినున్న నగలు రెండు వేలరూపాయలు వచ్చి నవి; అవన్నీ తండ్రికి ఇచ్చింది కామేశ్వరీ దేవి తందానా తందానా ! "ఓ అయ్యా, ఇవి అమ్మి ప్రజలకు పెట్టూ, తిండిలేక మాడుతున్నారు, బీదరైతులకు విత్తనాలకు గింజలు లేవు, కూలికి సత్తువ లేదు. "ఏ దేశమో పోయి ఏదైన తినబో తె