90 బాపిరా థ లు బొమ్మలవుతవి. ఆకాశంలో మబ్బులే ఆలకిస్తాయా! తందానా! జయమ్మా! ఆ అందాలబొమ్మ తుపాను సంగతి వినగానే కాలేజీ నుంచి, అన్న పూర్ణ లా వచ్చిపడింది. చిన్నతనంలో కామమా నేడు కామేశ్వరి, స్నేహితురాండ్రకు కాముడు, చుట్టాలకు ణ కామం! తందాన తానా ! ఆ ఖండం అంతా, కాటకంతో మండిపోతోంది. బియ్యం దొరకటంలేదు. జొన్నలు, చోళ్లూ, సజ్జలు, గంటెలు ప్రపంచంలోనే లేవో, అవి ఉద్భవించనేలేదో, అవి కథలలో మాత్రమె కనబడతాయో తందానా! తందానా! ఎంతమంది తల్లులు తమ తీపులు అద్దాలబిడ్డలకు ఆకలి తీర్చడానికి పాలు లేవని తల్లడిల్లి పోతున్నారో, కుళ్ళిపోతు 'న్నారో, తందానా తానా, తందా ...నా! గ్రామనాయకులు, జిల్లానాయకులు, దేశనాయకులు ఎంత గగ్గోలుపడినా, కంఠాలు బద్దలు కట్టుకొని ఉపన్యాసా లిచ్చినా ధనం ఊడిపడదు, దాక్షిణ్యం తొణికిసలాడదు, ధర్మం ప్రత్యక్షంకాదు, వితరణం అవతరించదండో! తానా తానా, తందానా! తానా తందానా తానా ! అప్పలస్వామిగాదె ఖాళీ అయింది పాతర్లు బయట పడినాయి. అప్పలస్వామి స్నేహితులు అరుదైపోయారు; చుట్టాలు చూపులేదు! పక్కాలు పత్తాదొరకరు; మాటస్తులు మొహాలు చాటువేసుకొన్నారండి బాబూ, బాబూ, బాబూ, బంగారు బాబు వినరండో! మొహ ఇంట్లో నగలన్నీ అమ్మాడు; వెండిసామానులమ్మాడు;
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/92
స్వరూపం