Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ర ప తి 7 నిపుణంగా వేయటంలో యిరువదినాలుగు రీతుల కతి సాములు, ఘాతము, గతి, వక్రము, ప్రతిఘాత, ఆవగతి, లక్ష్యము మొదలైనవాటిల్లో అత్యంతంగా ప్రావీణ్యం ఉంది. ధనుర్వేదంలో అర్జునుణ్ణి మించిపోతాడు. గజ తురగ శాస్త్రము లతనికి అశ్వనీకుమారుల కుమల్లే అతివిచిత్రంగా వచ్చు. ఆ నరపతి చాలా అందమైనవాడు. అతన్ని చూస్తే అప్సరసలు మొదలైన దివ్యనారీమణులక్కూడా హృదయం కొట్టుకొనేది. దేవతల్లోనే లేడు అతనితో సమానమైన సుందరమూర్తి. అతను అన్ని కళల్లో, అన్ని శాస్త్రాలల్లో మహాసిద్ధి సంపాదించాడు. సేవలు నడపడం, కొద్దిసేవలతో గొప్ప సైన్యములను కూడా చీకాకు పరచి నాశనం చేయడం, మనవ్యూహాలు పన్నడం, వీటిల్లో ద్రోణాచార్యుడు కూడా అతనికి ఈడు కాడు. భయంకరంగా ఆ నరపతి యుద్ధముజరిగినప్పుడుకూడా అతని సైన్యాలల్లొ భటులు ఎప్పుడూ కొద్దే నశించడం. రథ గజ తురగ పదాతిదళాల ప్రతివీరుడు, సము దాల్లొ యుద్ధనౌకలనావికులు అందరూ అతడంటే మహాప్రేమతో ఉంటారు. ఆతడు వారికి నచ్చిన నాయకుడు. గొప్పగా ధన మిచ్చు ప్రభువు, వారి హృదయం రంజించే వీరుడు. దేశాలన్నీ జయించా డా నర ప తి. కానుకలూ, కప్పాలు కొన్నాడు. రాజసూయయాగములు చేశాడా చిన్నతనంలోనే ఆక్ష ము కాక పోయినా. ఎ మూడు