Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వే షః మ ము 87 ప్రేమమూర్తి! ద్వేషపూర్ణమైన ఈ ప్రపంచంలో ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క దివ్యవిధానాన్ని, అహింసాస్వరూప మును నిర్ణయించుకుంటూ, ప్రేమావతారుడైన గాంధీ అహింసామార్గమును అన్వేషిస్తున్నాడు. ఆ మహాభావాన్ని సర్వవిధాలా ఉద్దీపింప జేయడం తనబోటివారి ముఖ్యధర్మము. ព ఆ చిత్రం విచిత్ర వేగంతో విజృంభింపసాగింది. నీలాలు, వంగపండు చాయలు పాటలవర్ణాలు. అయిదవరోజున సాయంత్రం ఒంటిగా ఆశ్రమానికి అనతిదూరంలో వున్న ఎత్తు ప్రదేశంమీద కూర్చుని విశ్వేశ్వ రుడు మేరీదివ్యమూర్తిని ఊహించుకుంటూ పులకిత దేహు డౌతూ, ఈ రెండు నెలలూ ఎట్లా భరించడమా అని ఆలోచించు కుంటూ, పరవశమైన స్వప్నాలుకుంటూ ఉన్నాడు. దశమినాటి చంద్రు డప్పుడే నీలాకాశంలో పైననే ఉన్నాడు. చంద్రకాంతులూ సంధ్యాకాంతులూ వియ్య మందుతూ వున్నవి. చటుక్కున చంద్రకిరణాల్లాంటి రెండుచేతులు అతని మెడను చుట్టుకొన్నవి. అతడు గుండె కొట్టుకుంటూ వెనక్కు తిరిగాడు “మేరీ, కలా?" జ నా "కలకాదు. నేను నిజాన్ని ప్రియా! నిన్ను వదలి ఇం గ్లండు వెళ్ళలేకపోయాను. రెండు నెలలయిన వెనుక మార్టీ వ్యాపారాలన్నీ సర్ది మన.. మన వివాహానికి వస్తుందట”. “ఓహో మేరీ! నీ ఇంత ప్రేమకు నే నెట్లా తగుదును ఇంతప్రేమకు దేవీ!” వెన్నెల వెలుగుదీ ప్తి దాల్చినది. ఆశ్రమంలో అందరూ ప్రార్థనకు చేరినారు.