86 బాపి రాజుకథ లు అతని కళ్ళల్లో పరమశ్రమణకు డైన బుద్ధభగవానుని శాంతకాంతులు పుంజీభూతాలయి దర్శనమిస్తున్నవని ఆమె వణికిపొయ్యేది. అతనిమూర్తిలో గ్రీకు దేవుడు, అపోలో ప్రతిఫలించ లేదు, సర్వ సౌందర్యరూపాలు ప్రోగుచేసుకొన్న భారతీయ దివ్యమూర్తి ప్రత్యక్షమయ్యేవాడు. “మీ భరత దేశానికి నేను నూతన యాత్రికురాలిని ఈ దివ్యజ్యోత్స్నలో నడి విశ్వా ! నా చేయిపట్టుకుని పించుకుపో" అని ఆమె అన్నది. వారిద్దరూ ఒంటిగా ఉన్నంతసేపూ ఆమె అతని ఒళ్లో ఉండవలసిన దే! వారి హృదయాలు రెండూ లయలు, శృతులు కావలసిందే, 14 మేరీ తక్కినవారితో ఇంగ్లండు వెళ్ళి తన వ్యాపారా లన్నీ సర్దుకొని తిరిగివచ్చేటట్లూ, అంతవరకూ విశ్వేశ్వరుడు శివగ్రామ ఆశ్రమంలో వుండేటట్లూ ఏర్పాటు చేసుకొన్నారు. మేరీ మార్గరెట్టు మొదలయిన వాళ్ళతో బొంబాయి వెళ్ళిపోయింది. ఒంటిగా ప్రాణ మే లోకానికో పోయిన వానిలా ఉస్సురంటూ ఆశ్రమంలో ఉన్నాడు విశ్వేశ్వరుడు, అతి వేగంగా అతి సున్నితంగా యిరువదినాలుగుర కాల దారం వడవడం నేర్చుకో ప్రారంభించాడు. అతి బాధతో ఇంకొచిత్రం ప్రారంభించా డతడు. ఉజ్వలరూపయై జగత్కల్యాణమూర్తియైన, శాంతి దేవియొక్క చిత్రము. సర్వకష్టాతీతమైన, సర్వద్వేషాతీతయైన పరమ
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/88
స్వరూపం