Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

11] ద్వేషము 85 అతను ఒక రోజున పద్నాలు చెక్కిన వీఠంమీద అధివ సింప జేసి, పది వేల పూవులతో పూజించినాడు విశ్వేశ్వరుడు అందాలు పుణికిపుచ్చుకున్న చీరలు ఖరీదుకలవి కొని తెచ్చి, ఆమెను ధరింప జేసి ఆమెకడ మోకరిల్లాడు. అతనికళ్ళలోని పూజ, ఉదయ సూర్యుని వర్ణాలులా ఉదయసూర్యుని అలిమి వేసినది "నీ సౌష్టవమూర్తిత్వానికి కాదు, నీ స్నిగ్ధ బాలి కాత్వానికికాదు, నీ హిమాచ్ఛ శరీరకాంతికి కాదు, నీ ఆంగ్లో నీ శార్జను జాతిత్వానికిరాదు, నీ దివ్య సౌందర్యానికి కాదు, మేరీ! నిన్ను నేను పూజించేది. నువ్వు నా దేవివి! నామోదా నివి! నా నిత్యవు111 “నిన్ను ముద్దుపెట్టుకొని నీకు నల్లతనము ఇస్తానేమో నన్న భయం... “నువ్వు లగా మాయం కావుగదా ? నువ్వు సూర్యుని కుమారిలేవు కావుకదా ?”” “ఇన్నాళ్లు ఈ ద్వేషం నా హృదయంలో వున్నం దుకు ఫలితానివా ? నన్ను దేషరహితుణ్ని చేయడానికి వేంచేసిన దివ్యసాన్ని ధ్యానివా ?” ఆతడు పట్టుశాలి పొందూరు ధోవతి ధరించి, పొం దూరులాల్చీ ధరించి ఆమెకడకు వచ్చినప్పుడల్లా, ఆమె చిన్న పరుగుతోవచ్చి అతన్ని కంఠముబిగియార బాహులతలు చుట్టి వేసేది. ఆతని విశాలఫాలంలో వేద ఋక్కులు పనసలు పాడు తున్నవని ఆమె అనుకొని నేది.