82. బాపిరాబుకథ లు " హేళనకాదు మేరీ ప్రియతమా! ఈ పర మేశ్వరుణ్ని, ఈ ప్రధమ రాత్రిక్షణాల్ని అడుగు... అడు గూ!” ఆ రాత్రి బంగళాలో మార్గరెట్టు వరండాలో పడక కుర్చీ మీద కూర్చుని నెహ్రూ జీవిత చరిత్ర చదువుకుంటున్న ప్పుడు మేరీనడుముచుట్టూ విశ్వేశ్వరుడు చేతినిచుట్టిన్నీ. విశ్వే శ్వరుని బుజంమీద మేరీ తలవాల్చిన్నీ, మార్గరెట్టు ఎదు టకువచ్చి, ఆమెపాదాలకడ ఆ ప్రేమికులు మోకరిల్లారు. మార్గరెటు చటుక్కున నుంచొని దివ్యానందము మోమున నృత్యం చేస్తుండ, కళ్ళువవిత్రకాంతులు ప్రసరిస్తూ ఉండగా "నా హృదయంలోని కోర్కె ఈడేరింది నా బిడ్డ అంటూ వాళ్ళిద్దరితలలమీద రెండు చేతులూ లారా!"" వేసింది....... 12 ఈవా రవిని నెల్లి భూమిమీద ఫట్ ఫట్టని చప్పు డవుతూఉండగా జోళ్ళపాదాలతో గబగబ ధడధడ, అతి కోపంగా బాదింది. “ నేను ఒప్పుకోను, ఈ వ్యవహారాన్ని పళ్ళతో గోళ్ళ తోపీకి చీల్చి చెండాడుతాను. ఈ సంయోగం కానివ్వను. మేరీగార్డియనుకు ఉత్తరం వ్రాస్తాను. కోర్టుల్లో దెబ్బలాడ తాను. ఆంగ్లప్రభుత్వానికి విజ్ఞ ప్తి పెట్టి అడ్డగిస్తాను. సిగ్గు సిగ్గు!" అని అల్లరి చేసింది. ఘోల్లున ఏడ్చింది. పక్కమీదపడి " దొర్లింది!
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/84
స్వరూపం