80 బాపిరా థ లు ఆ దుమారాలను అణిచివేస్తూ ఆమె కంటిబిందువుల బడి గాలివాన అయ్యింది. ఆ సాయంత్రందాకా విశ్వేశ్వరుడు తిండి తినకుండా తన బసలోనే పండుకొని ఉన్నాడు. అతని చుట్టూ చీకట్లు అలుముకొన్నాయి. ఆతనిలో చీకట్లు గడ్డకట్టుకుపోయినవి. అతని రక్త ప్రవాహం పూర్తిగా ఆగిపోయినట్లయింది. ఆ సాయంకాలపు ధూప్ చాఁహాలో మెల్లగా అడు గులు వేస్తూ ఒంటరిగా విశ్వేశ్వరరావు తలవాల్చికొని, పరశు రామేశ్వర దేవాలయానికి పోయి వెలుగు వెనక నీడరూపం (సిల్ హౌటీ)గా కనపడే ఆ గుడిని చూస్తూ చూచీ చూడని చూపులతో చతికిలబడి ఉన్నాడు. ఇంతలో చీకటి ఎక్కువౌతూఉన్న ఆ సంధ్యలో అతని భుజంమీద ఒక చల్లనిహస్తం ఆ హస్తము ఒక - పావురము ఒక బురుజుమీద వాలినట్లు వాలింది. అతనిఒళ్లు మరుపులలో తూలింది. అతడు జలదరించి పోయాడు. అతనిహృదయంకరడు తనలోంచి కరిగిపోయింది. ఆతడు నెమ్మదిగా వెనక్కు తిరిగాడు అతని వెనక మెరిసి పోయేనక్షత్రాల్లాంటికళ్ళతో తన్ను కలకల చూపులు చూస్తూ మేరీ టెంపిల్ కూచునివుంది ఏదో మత్తువిడిచిన వానిలా చటుక్కున విశ్వేశ్వరుడు ఆమెవైపుకు మరలి ఆమె రెండుచేతులూ తన చేతులతో అదిమిపట్టుకు మేరీ! మెరీ! నువ్వు నా జీవితంలోకి ఎందుకు ప్రత్యక్ష మయ్యావు? నా ప్రేమ విశ్వాలను పార్లి, శూన్యాలు ఆశ్ర
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/82
స్వరూపం