Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వేషము 79 “జగన్నాధరథము” అను చిత్రమును ఆంగ్ల స్త్రీ మండలానికి చూపించాడు. - వాళ్లు ఆ బొమ్మని చూచి భయపడిపోయారు. వాళ్లు అతనిహృదయంలో ఎంత ద్వేషము, ఎంత క్రోధము, ఎంత హింస గూడుకట్టుకుని పేరుకుపోయినవో చూసి గజగజ లాడారు. మేరీ ఒంపిల్ కళ్ళవెంట చుక్కలు రాలినవి. ఆమె అన్నది. “మమ్మల్నెంత ద్వేషిస్తు న్నావు విశ్వేశ్వర్ !" అని... బొటబొట పదహారు ఆ ముక్కలకు విశ్వేశ్వరుడు ఎంతో సిగ్గుపడిపో -యాడు, కుంగిపోయాడు; ఆ సిగ్గుతో దహించుకుపోయాడు; ఆమెకంట నీరు నుడులుబోయి, ఆ బిందువులు అమృతపు చినుకులై అతని హృదయాన్ని దహించివేసినవి. అమృతమే కాలకూటమైనది. వాళ్ళ ఎదుట నిలువున కుంగిపోయిన మోముతో కాళరాత్రులు కమ్మిన కళ్ళతో భయంశ రదోషి ననుకుంటూ, విశ్వేశ్వరుడు దహించుకు పోయాడు... ఎవ్వరూ మాట్లాడలేదు. గబ గబ మేరీ గదిలోనికి పారిపోయింది, చురచుర విశ్వేశ్వరరావును అతి కోపంతో చూచి, నెల్లీ ఆ బాలిక వెనకాలే వెళ్ళబోతే మార్గరెట్టు ఆమెను కనుసన్నలతో ఆపుచేసింది. చేతులు కట్టుకొని తూలుతూ విశ్వేశ్వరుడు తన బసకు వెళ్ళిపోయాడు... అతనిలో గాలి దుమారాలు రేగాయి,