Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6 ణ బాపిరాజు బాపి రాజుక థ లు పట్టుకోని వచ్చిన మంత్రులు, సేనానాయకులు, రాజకుమారు లున్నూ —వాళ్ళమీదనుంచి రాళ్ళు పొదిగి నబంగారపు చెప్పు. లతో నడుస్తూ తనమందిరం చేరాడా రాజు. ఆమందిర వైభవం మచిలీపట్టణపు పల్యంకపురీ ప్రతినీరాదులు, గంధాతిముక్తక శ్రీపర్ణి కాది దారువులశిల్పములుగల గోపాన పటలాదులు, దంత స్తంభాలు, రత్నస్థగిత సువర్ణ సింహాసనాలు, సింహ శార్దూల మృగాదన కృష్ణసారాది మృగచర్మాలు, సువర్ణ ధూపదీప స్తంభాలు, కాశ్మీరపు పట్టు పని చేసిన దుకూలాంబ రాల చాందినీలు, అందుండి వ్రేలాడు నీలగారుత్మతలోహితక, వజ్రముల దీపపుబుళ్లు, భీమ, వాయుపు తాభిమన్యు, రామ, రావణ, సుందోప మందాదిపేరులు చిత్రలేఖనములు, స్ఫటిక రత్న నీలాది వివిధవర్ణ శిలలు, చంద్రశిలలు చెక్కిన శిల్పాలు. - ఆ నరపతి వచ్చి పట్టు తలగడలు, పరుపులు వేసిన ఒక పీఠముపై అధివసించగా, పూర్ణచంద్రబింబాస్యలగు బాలికలు వచ్చి, కొందరు సువాసన వేళ్ళ విసనకఱ్ఱలతో వీస్తున్నారు. కొందరు వీణాగీతాలతో కంఠాలు మేళవించి, కాకలీధ్వనులతో పాటలు పాడుతూ ఉన్నారు కొందరు పాద సేవ ఉన్నారు. కొందరు వర్ణకంతో వూరంగా అతని దేహ Ед మునకు లేపూత పూయుచున్నారు. చేస్తూ అయి ఆ నరపతి మ-సత్వుడు, ఆజానుబాహుడూ ఉన్నాడు. అతని విశాలమైనపక్షం హిమాలయపర్వత సాను వులా ఉంది అతనిభుజాలు, చేతులు ఏనుగు కుంభాలు, తొం డాలు. ఆ నరపతి గౌరీశంకరశృంగంలా మహోన్నతరూపుడు. మల్ల యుద్ధ గదాయుద్ధాలలో శక్తి, తోమరం అవీ అత్యంత