Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

72 థ లు ఆ మేరీ! ——ఏమి ఆమె అందం... ఎందుకు వాళ్ళని తిట్టుకోడం. "ఓయి వెట్టిమొగపు విశ్వేశ్వర రావూ! నువ్వు వట్టి వాజమ్మవు. నీ అగ్ని చల్లారింది. నీ హృదయం చచ్చింది. నీ అభిమానం అధోగతి పాలయింది. నీ దేశభక్తి కుళ్ళి — పోయింది లే... ఏడు, నెత్తినోరూ బాదుకొని, గాజులు తొడిగించుకొని, వంట చెయ్యి, జజ్జమ్మా, చచ్చమ్మా!” 9 “మేరీ, చిన్న ఫొటో బాగా తీశావే! ఏమిటీ అతిగా పరికిస్తున్నావు ఆ విశ్వేశ్వరరావు బొమ్మను?” అని నెల్లీ మేరీని పలకరించింది. వాళ్ళంతా మధుర దేవాలయం చూస్తున్నారు. తిరు మలనాయకుని మహాభవనం చూశారు. మండపం చూశారు. తెప్పాకులం చూశారు. మేలగోపురాలు పరిశీలించారు. మీనాక్షి గుడియెదుటఉండే లోని మండపంలోని విగ్ర హాలని సందర్శిస్తున్నారు. తిరిగి తిరిగి నృత్యమూర్తి మూరి అయిన శారదా దేవి విగ్రహంకడకు వచ్చారు. ఆ విగ్రహం యొక్క చిత్రం ఓటి విశ్వేశ్వరరావు - చక్కని రేఖాచిత్రంగా తన స్కెచ్చి పుస్తకంలో వ్రాసుకొనిఉన్నాడు. ఆ రేఖాచిత్రం చాలా అందంగా చిత్రించినాడు. “ఆ చిత్రం, అందుతో బాటు తనూ తెలియకుండా ఈ విగ్రహంచూస్తే జ్ఞాపకంరాగా అతనికి నేను తీసిన అతని ఛాయారూపం చూస్తు న్నాను నెల్లీ!” అన్నది మేరీ. నెల్లీ పకపక నవ్వింది.