70 బాపిరా థ లు మేఘశకలంలా గోచరిస్తున్నది. పువ్వుని కమ్మున నల్లనితుమ్మె దలా అతని ద్వేషంచుట్టూ జుమ్మని తిరగడం ప్రారంభించింది. అతనిహృదయం పుష్పంచధ్యాన అల్లరిచేయకుండా, తేనెలు తాగుతూ, దాగుకుంటూ, ఏదో ఒక భావం, ఏదో ఒక కోర్కె, ఏదో ఒక అనుభూతి! మేరీమాటలు, మేరీ పాటలూ, మేరీనడక, మేరీవాదన, మేరీ శిల్పహృదయం...... ఆమె భారతీయ శిల్ప దేవాలయం యొక్క ప్రధమ ప్రాంగణంలోకి ప్రవేశించింది. "ఎందుకు ఈ దేవాలయానికే ఆమె రావాలి? ఆమె నా హీన పాశ్చాత్య శిల్పశిధిలత్వంలోనే పొర్లాడనీ, ఎప రామె భారతీయ మహాశిల్పసత్యాన్ని గోచరింప చేసుకొనే అధికారం సంపాదించడానికి? “పోనీ, ఈ నీచ స్త్రీలను తన దేశం వదలనీ! వాళ్ళతో పాటు తమ దేశ సౌభాగ్యం తమకే ఉండనీ! దేశంలోని సువర్ణ రాసులు, దేశం యొక్క మహాసౌభాగ్యమైన అభిమానమూ, మానమూ, స్వేచ్ఛా తస్కరించుకుపోయింది పోక, ఈ కజిన్సులు, ఈ హావెల్సులు, ఈ గ్రాసు రెస్టులూ, ఈ క్రూల్డేలు, ఈ గిల్లులు, ఈ మేరీలు మా శిల్పం కూడా తస్క మా రించుకు పోవాలీ? అతనికలు విషవాయువులు వీచే నాభి సుమా లయ్యాయి. అతని పెదవులు పళ్ళల్లో, ఎలుకబోనులా బిగు సుకు పొయ్యాయి. ముష్టిపట్టి అతడు బల్లను గట్టిగా గుద్దినాడు... వాళ్ళతో ఉన్నప్పుడు తనతంత పిరికితన మెందుకో? వాళ్ళను
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/72
స్వరూపం