ອງ ద్వేషము 69 'నా ప్రియ బాలికల్లారా ? నాకు పాలంపేట గుళ్ళో ఒక దీక్ష అంతరాత్మలోంచి ఉద్భవించింది. రెండు రాత్రిళ్లు ప్రార్ధ నతో ఆ భావము సత్యమైందా? కాదా? అని భగవంతుని ప్రశ్నించుకున్నాను. ఈ విషయం యావత్తూ గాంధీమహాత్ము నకు వ్రాసుకున్నాను. ఆయన జవాబు నన్నా శీర్వదిస్తూ- జవాబు_నన్నా రానివ్వండి; ఈ బాలకుడు మనల్ని చంపుతాడా? చంపనీ ఈలాంటివాళ్ళ ద్వేషానికి మనం ఆహుతి కావడం ఎంత విచిత్రమైన పవిత్రమైన దానము ప్రేమతో బలిదానం ఈ పుద్యమాన్ని అరికట్టదా? ” అని అరమూతలైన చూపులతో దివ్యహాస నృత్తాలైన పెదవులతో పలికింది. ఆమెను గాఢంగా కౌగిలించుకుంది. “ప్రియా! నాకున్న అనుమానాలు వెంటనే మేరీ పటాపంచలు చేశావు. ఈ రాత్రి ఒక రహస్యం నీతో చెప్పి, నా హృదయ తావం ఉపశమనం చేసుకుంటాను" అని అన్నది. తక్కినవాళ్ళంతా, “ఏమిటి మేరీ! గాంధీగారు రహ స్యాలు ఉండకూడదన్నారు కాదా?" అని ఒత్తిడిచేశారు. చిరునవ్వు నవ్వుతూ మేరీ, 'తొందర పడకూడదు. స్పష్టత పొందని ఆలోచనలు అప్పుడే వ్యక్తంచేయలేను. అది సరి గాదూ? మార్గీ !" అని మార్గరెట్టు వైపు చూసింది. నవ్వుతూ "అలాగే మేరీ!" అంది ఆమె. అందరూ నవ్వుతూ ప్రయాణం అయ్యారు విశ్వేశ్వర రావు వాళ్ళదగ్గిర సెలవుతీసుకొని గబుక్కున మద్రాసుతిరిగి వచ్చాడు. దారిపొడుగునా మేరీ కన్యామూర్తే అతని యెదుట
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/71
స్వరూపం