Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7 68 వాళ్ళతో మైసూరుదాకా యాత్రలు సాగించాడు విశేశ్వరరావు. ఎక్కడో అణిగివున్న అతనిలోని మర్యా దంతా ఉబికివచ్చింది మార్గరెట్టుకు విశ్వేశ్వరరావుకూ అహింస, జాతిభేదాలు, కళలు, సాహిత్యమూ మొదలయిన విషయాల్ని గురించి వాదాలు జరుగుతూ వుండేవి. విశేశ్వర రావు కోపం విపరీతరూపం తాల్చేది. అతడు మేరీ అందం చూచి భరించలేకపోయేవాడు. అతనిలోని క్రూరత్వము లోలోన గాలివాన రేగింది మింగబోయే కప్పను పాము వెంబడించినట్టు వాళ్ళతోకూడా అతడు ప్రయాణాలు చేసినాడు. ప్రయాణాలుచేసినాడు. వాదనలోని కరకుతనమూ, విజ్ఞానమూ E అతనిలో వెలుగునీడలు అయ్యాయి. ప్రతి వాదనవిషయములోనూ అతిని ద్వేషం ఉడుకెత్తుకొని, ఉబు కెత్తుకొని, పరవళ్ళు తొక్కుతూ ప్రవహించింది. అది 'గై సరు' లా వేడినీటి ఊటలా ఆకసం అంటేటట్లు గబుక్కున వస్తూవుండేది. అతనికున్న అపారజ్ఞానం ఆ పాశ్చాత్యస్త్రీలను ఆశ్చ ర్యంలో ముంచింది. అతని ద్వేషానికి వాళ్ళలో కొందరు ఒణికి పొయ్యారు. ప్రతి భారతీయయువకుడు ఇల్లాగే ఆంగ్లేయులను ద్వేషిస్తున్నాడా ? ? నెల్లీ మార్గరెట్ట తో అనేక సార్లు "ఎందుకీ రాక్షసుణ్ణి కూడా తిప్పుకోవడం" అని కోపంతో వాదించింది. మేరీ తప్ప. తక్కినవాళ్లు ఆమెవాదాన్ని బలపరచారు. కాని మార్గరెట్టు చిరునవ్వు నవ్వుతూ.