Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వే త ము మము 67 ప్రతి శిల్పందగ్గరికీ వాళ్ళను తీసుకువెళ్ళి దానిని గూర్చి విశ్వేశ్వరరావు చక్క నిభాషలో గంభీరమయిన భావంతో విపులంగా చెప్పాడు. కొద్ది వాక్యాలలో భార తీయ శిల్పలక్షణాలను గురించి వాళ్ళకు బోధపరచాడు. భార తీయశిల్పానికీ పాశ్చాత్య శిల్పానికి ఉండే తేడాలు ఉపన్యసించాడు. అనర్గళంగా “ఇక్కడనుంచి మీరు ఎక్కడికి వెడతారు ?" అని ప్రశ్నించా డతడు. మేరీ:_ గాంధీమహాత్ముని ఆశ్రమంలో పదిహేనురోజు లున్నాము. వార్ధావెళ్ళి అజంతా, ఎల్లోరా, ఎల్ఫెంటాలు మాత్రమే చూశాము. అక్కడనుంచి తిన్నగా హనుమ కొండ, ఒరంగల్లు చూసి ఇక్కడికి వచ్చాము. హిందూ దేశము యావత్తూ చూడాలని సంకల్పంఉంది.” విశ్వే:- అట్లయితే ఇక్కడినుండి అమరావతి, నాగా రునకొండ చూసుకొని, అక్కడినుంచి హంపి, బిజాపూరు, బాదామి, హర్సనహళ్ళి యాత్రలు సేవించుకొని; పెను గొండ, తాడిపత్రి, లేపాక్షి వెళ్ళి మైసూరులో హళేబీడు, బేలూరు, శ్రవణ బేళగొళాయాత్రలు సేవించవచ్చు. నేనున్ను లేపాక్షి వఱకు విూళ్లో వస్తాను మీకు నారావడం ఆక్షేపణ లేకపోతే,