66 బాపి రాజు కథ లు క్షమాపణ వేడుతున్నాను. మీ బొమ్మ అయినదాకా పైనే తిరిగివస్తాము” అని చిరునవ్వు నవ్వుతూ తనజట్టు యావ న్మందితోను రండని సైగజేసి, వాళ్ళతో పైకిపోయింది. నిర ఖస్ ఖస్సని బుసలుకొట్టుతూ మాట్లాడిన విశ్వేశ్వర రావు విభ్రాంతిపొంది, తనది జయమో ఆపజయమో యించుకోలేక పోయాడు. అందాలు పుణికిపుచ్చుకొన్న ఆ శ్వేత బాలిక చిరునవ్వు నవ్వుతూ తన వైపుకు వార చూపులు ప్రసరింపజేసి వెళ్ళిపోయింది. ఎంత అందంగా వున్నది! శ్వేతజాతుల్లో అందమైన వాళ్లుంటారా? దేహసౌష్ఠవంలో భారత నారీమణులు ప్రపంచంలోని తక్కిన స్త్రీలకన్న అందమయిన వాళ్ళు యినవాళ్ళు కారా ? ఒక వేళ బాహ్యసౌందర్యంలో కొందరు పాశ్చాత్య జాతుల స్త్రీలు హైందవనారీమణులతో స మాన మై నా హెచ్చయినా, అంతస్సౌందర్యంలో వాళ్లు ఎట్లా పోలగలరు ? కాని ఆ అమ్మాయి . ఏవో శిల్పసౌందర్యాలను సేకరించు ఆ .ఏవో కొన్నది. O అయినా వీళ్ళసంగతి? విశ్వేశ్వరరావు గబ' బ రెండంగల్లో వేరేపక్క నవున్న దేవాలయంలోని శిల్పం చూస్తూవున్న ఆ యువతీ మండలిదగ్గరకు పోయి వాళ్ళకు జోహారించి, “నన్ను మీరంతా క్షమించాలి. ఈ శిల్పాలను గురించి నే నంతా చెప్పడానికి మీరు అనుజ్ఞయిస్తే, మీరు నన్ను క్షమించినట్లు ఎంచుకొంటాను" అని పలికినాడు. మార్గరెట్టు నవ్వుతూ “అలాగే రండి. చెప్పండి; మా కృతజ్ఞత అందుకోండి" అన్నది. కొంచెం
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/68
స్వరూపం