64 బాపిరాజుకథ లు థ అలాగే హైందవజాతిలో ఉన్న అనేకమైన లోటు ఆంగ్ల జాతిలో లేవని చెప్పవచ్చునా కాదా ? మేరీ:- ఒక జాతికి ఇంకొక జాతికి అనేక విషయాలలో తేడాలుంటాయంటావా లేదా ? ఆ తేడాలలో ఒక జాతి ఎక్కువ, ఒక జాతి తక్కువా అవుతుందా లేదా ? మార్గ:- జాతికి జాతికీ తేడాలుండవచ్చు; ఆ తేడా లలో హెచ్చులూ తగ్గులూ ఉండవచ్చు. అంతమాత్రంచేత ఒక జాతి గొప్పది, ఒకజాతి హీనమయినది, ఒక జాతి ఎక్కు వది అనేదిమాత్రం నేను ఈషణ్మాత్రమూ నమ్మను. అలా నమ్మేవాళ్ళను చూస్తే నాకు సంపూర్ణమయిన విచారం అని మాత్రం చెప్పగలను. వారంతా అక్కడనుంచి లేచి, పాడుపడిపోయిన ఆ రంగమంటపంలోకి వెళ్ళారు. అక్కడ ఒక స్థంభంలో చెక్కిన దివ్య నటరాజమూర్తి విగ్రహాని కెదురుగుండా కూర్చుని, ఆ బొమ్మయొక్క ప్రతిరూపాన్ని చిన్న చిత్ర లేఖన పుస్తకంలో వ్రాసుకొంటూ ఆ యువకుడు వాళ్ళకు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఆ విగ్రహంయొక్క అద్భుత సౌందర్యా నికి ఆ కుర్రవానిదీక్షకు ఏదో పరమశ్రుతి వాళ్ళకు గోచరిం చింది. ఆ నృత్యంలో ఉండే విచిత్ర భావం ఎవరు చెప్పగలరు? తమకు ఒక్క అయిదు నిముషములు వాళ్లు నిముషములు వాళ్లు నిశ్శబ్దంగా దృశ్యం చూస్తూ నిలబడ్డారు. పదిమందీ పదిస్థలాలకు, అప్పుడే కాలిజోళ్లు టక్కుటక్కున చప్పుడు చేసుకుంటూ, వివిధ
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/66
స్వరూపం