Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

బాపి రాజుకథలు


డేమైనా అన్నాడా నిన్ను ? వాడిమాటలు మాకుకొంచెం కోపంగానే వినిపించాయి” అని మేరీని వీపుతట్టుతూ మళ్ళీ పలకరించింది మార్గ రెట్టు.

మూలమూలలకు చెదరిపోయిన ధైర్యశక్తిని నెమ్మదిగా చేరదీసికొని, గుండెల్లో పదిలపర్చుకొని మేరీ వెల వెల బోయే చిరునవ్వు నవ్వింది

“ఆఁ ఆ! ఏమిటి అన్నావు మార్టీ! అబ్బే! ఏమీ లేదు! ఆ కుర్రాడు ఏమన్నాడో నాకూ వినపడ లేదు. ఈ ఉదయపు చిరిచీకట్లో ఎవరూ లేరు కదా అని నేనువస్తే ఆ అబ్బాయి కనపడ్డం చేత భయపడ్డాను, అంతే”

ఇంతట్లో హెలెన్ అనే అమ్మాయి "ఏమి అందంగా వుఁ దే ఈగుడి! ఏమి అందంగా చెక్కాడు నందుల్ని ప్రతి స్థంభంపైనా తనకున్న కళంతా ధారపోసి నాట్యంచేసే ఈ స్త్రీల విగ్రహాలను చెక్కినవాడు ఎంతటి మహాశిల్పోకదా!” అన్నది.

సుసిః "రాతిలో చెక్కాడా, రాతిని కరిగించి పోశాడా?"

నెల్లి : —“ఇవి రాతిబొమ్మలు కావర్రా——శాస్త్రము అంతా కనబరచి ఇనుము కరిగించి తయారుచేసిన బొమ్మలుగాని!”

"మేరీ—ఆ దేహ రేఖలు, ఆ శరీరసౌష్టవం, ఆ విచిత్ర భంగిమ, ఆ రాతితనంలోని నలుపును మరపింపజేస్తున్నవి కదా, రక్తంపో టెత్తుకువస్తూ, స్నిగ్ధమై, సిక్తమయిన ఆమెశరీ