Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వే ష ము

59


వెనక్కు తిరిగింది మేరీ. విషాలుకక్కే చూపులతో రెప్ప వాల్చకుండా, తన కేసి చూస్తున్న ఒక యువకుడు బిర్రబిగిసి నిల్చిఉన్నాడు.

“అపశ్రుతి ఇక్కడలాగ దాపురించా వేమిటి?”

తెలబోయి మేరీ టెంపిల్ మాటాడలేక పోయింది.

" దేశమంతా పిప్పిచేస్తూ ఎక్కడో మూల దాక్కోని వున్న ఈ కాస్త కళనుకూడా నమిలి వేయడానికి వచ్చిన తెల్ల రాక్షసిలాగున్నా వే నీవు?”

మేరీ భయంచేత కుంచుకుపోయింది. అందమైన ఆమె పెదవులు అప్రయత్నంగా విడివడినాయి

"నీ దేశంపోయి మమ్మల్ని అపహాస్యం చేయడానికా? మేయోపిశాచంలాగ ఇక్కడి కెందుకువచ్చావు?" బిర్రబిగుసుకుపోయి మేరీ రాయిపడి శిలావిగ్రహంలా అయిపోయింది.

ఇంతట్లో తక్కిన జట్టు వాళ్ళంతా అక్కడికి వచ్చారు. వాళ్ళందర్నీ చూస్తూ అసహ్యంచేత కనుబొమలు ముడుచుకు పోగా, పై పెదవి పైకి తిరిగిపోగా ఆ యువకుడు విసవిసనడిచి చక్కాపోయాడు

మార్గ రెట్టు సెల్లి వాన్ మేరీని చూచి, ఆ అ ఏమిటి నీతో ఇంగ్లీ షులో మాట్లాడుతున్నాడని ప్రశ్న వే

ఎక్కడో నీలాకాశంలోంచి ఊడిపడిన పిడుగు తిన్నదానిలా చైతన్యం తప్పిఉన్న మేరీ మార్గరెట్టు లను వినిపించుకోలేదు "మేరీప్రియా! ఏమిటే అలా చుస్తున్నావు పామును చూచి భయపడే పాశ్చాత్యునిలా?”

“తళుక్కు మని దెయ్యంలా మాయమైన ఆ కుర్రా