5
ఉదయసంధ్యానృత్యపరవశుడయిన నటేశ్వరుని పద కింకిణీరవాలు రామప్ప చెరువు చిరు కెరటాలలో లీనమైపోయి నవి. లూయీబోధం, బొగైన్ విల్లా పూల యొక్క కుంకుమ వర్ణం. తెరను కట్టి ప్రత్యూష మంగళగీతికారవాలను, నేపథ్య గాంధర్వ మొనరిస్తున్నది. ఉదయ కాదంబినీమూర్తియొక్క అవ్యక్తరూపాల నుంచి ఉదయనృత్యాలోక నాభిలాషులయిన దివ్యులు అనిమిషులై పొడచూపుతున్నారు అంగహార వివిధ కరణోపేతమైన అభినయలాస్యయుక్తలై అప్సరసలు పరమ నటునకు హంగుచేస్తున్నారు రామప్ప దేవాలయంలో ప్రత్యక్షమవుతున్న ఈ దివ్యలీలనంతా దర్శించడానికి గాఢాభి లాషు లై, “మార్గ రెట్టు సల్లివాన్" జట్టువా రా తెల్లవార కట్లకే ఆ దేవాలయానికి వేంచేశారు.
కారులు దిగడంతోనే, అందరికన్న ముందుగా పరగెత్తుకు వెళ్ళాలని అయిదంగల్లో వంతెన దాటింది, సింహద్వారం దాటింది, మండవం చేరింది మేరీ టెంపిల్, ఆ మండపం ముందర శిల్ప వైభవం చాటేస్తంభాలు, ఆ స్తంభాలకు శిఖర స్వరూపాలుగా నాట్యంచేసే నల్ల రాతి శిల్పకన్యకలు, ఆ శిల్పసుందరుల నాట్యభంగిమ రేఖావిలాసాలను చూసి నిస్తబ్ధు రాలయిపోయింది మేరీ. ఆ శిల్పబాలలందరలో ఒక మనోహరాంగి, తన ఆనందంతో మేరీగుండెను చిదిమి వేసింది. తదేక దీక్షతో అలాగే చూస్తూ ఆమె నిలబడివుంది
తన వెనకా లేదో చప్పుడయినట్లు కాంచి, చటుక్కున.